
2025 ICC మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ vs ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 4 పరుగుల తేడాతో గెలిచింది. అక్టోబర్ 19న ఇండోర్‌లో జరిగిన ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 284 పరుగులు మాత్రమే చేసి 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ ఓటమితో భారత్ సెమీఫైనల్ అవకాశాలపై ప్రభావం పడింది. మిగిలిన మ్యాచ్‌లలో గెలవడం ద్వారా పాయింట్ల పట్టికలో పై స్థాయికి చేరాల్సిన అవసరం ఉంది.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.
వన్ డౌన్ బ్యాటర్ హీథర్ నైట్ (Heather Knight) (91 బంతుల్లో 109; 15 ఫోర్లు, సిక్స్) మెరుపు సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. నైట్‌తో పాటు ఓపెనర్ యామీ జోన్స్ (56) రాణించింది. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (38) పర్వాలేదనిపించింది.
మరో ఓపెనర్ ట్యామీ బేమౌంట్ 22, సోఫీ డంక్లీ 11, అలైస్ క్యాప్సీ 2, సోఫీ ఎక్లెస్టోన్ 3 పరుగులు చేశారు. ఛార్లోట్ డీన్ (19), లిన్సే స్మిత్ (0) నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 4 వికెట్లు పడగొట్టగా.. శ్రీ చరణి 2 వికెట్లు తీసింది.
భారత్ బ్యాటర్లలో స్మృతి మందాన 88 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, హర్మాన్‌ప్రీత్‌కౌర్ 70 పరుగులు, దీప్తీ శర్మ 50 పరుగులతో రాణించారు. చివరిలో వరుస వికెట్లు కోల్పోవడం వలన 4 పరుగుల తేడాతో భారత జట్టు ఓటమి చవిచూసింది.
ఇంగ్లండ్ బౌలర్లలో బ్రంట్ 2 వికెట్లు తీయగా, బెల్, లిన్సే స్మిత్, ఛార్లోట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్ తలోవికెట్ పడగొట్టారు.