మెస్సీ ఆడ‌డంపై క్లారిటీ.. అర్జెంటీనా జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌ | Messi-To-Represent 6th Time-Argentina Team Announced FIFA WC 2026 | Sakshi
Sakshi News home page

FIFA WC 2026: మెస్సీ ఆడ‌డంపై క్లారిటీ.. అర్జెంటీనా జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌

May 29 2026 2:24 PM | Updated on May 29 2026 3:28 PM

Messi-To-Represent 6th Time-Argentina Team Announced FIFA WC 2026

జూన్‌ 11 నుంచి మొదలుకానున్న ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫుట్‌బాల్ టోర్నీ కోసం అర్జెంటీనా శుక్ర‌వారం త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది. 2022లో ఫిఫా చాంపియ‌న్‌గా నిలిచిన అర్జెంటీనాను మ‌ళ్లీ మెస్సీనే న‌డిపించ‌నున్నాడు.  26 మంది స‌భ్యుల‌తో కూడిన బృందాన్ని అర్జెంటీనా జ‌ట్టు కోచ్ లియోనిల్ స్క‌లోని ప్ర‌క‌టించారు. ఇటీవ‌లే ఇంట‌ర్ మియామి క్ల‌బ్ త‌ర‌ఫున మ్యాచ్ ఆడుతూ మెస్సీ గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. 

గాయం కార‌ణంగా అత‌డు ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు దూర‌మ‌వ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఆ వార్త‌ల‌కు తెర‌దించుతూ మెస్సీ ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆడనున్న‌ట్లు, జ‌ట్టుకు సార‌థిగా అత‌నే వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు స్క‌లోని వెల్ల‌డించాడు.  ఈ నేప‌థ్యంలో మెస్సీ రికార్డు స్థాయిలో ఆరోసారి ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌ ఆడ‌నున్నాడు. ఎనిమిది సార్లు బాల‌న్ డీ ఓర్‌ అవార్డు గెలిచిన మెస్సీకే సార‌ధ్య బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. 

ఖ‌తార్‌లో నాలుగేళ్ల క్రితం జ‌రిగిన వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో అర్జెంటీనా టైటిల్‌ను గెలిచిన విష‌యం తెలిసిందే. అయితే అర్జెంటీనా జ‌ట్టులో రియ‌ల్ మాడ్రిడ్ ప్లేయ‌ర్ ఫ్రాంకో మ‌స్తాన‌టునో పేరు మాత్రం జ‌ట్టులో క‌నిపించ‌లేదు. జూన్ 11న మొద‌లుకానున్న ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌కు అమెరికా, మెక్సికో, కెనడాలు సంయుక్తంగా ఆతిథ్య‌మిస్తున్నాయి. 

గ్రూప్ జెలో ఉన్న‌ అర్జెంటీనా త‌మ తొలి మ్యాచ్‌ను కన్సాస్‌ సిటీ వేదికగా జూన్ 17న అల్జీరియాతో ఆడ‌నుంది. అర్జెంటీనాతో పాటు అల్జీరియా, ఆస్ట్రియా, జోర్డాన్‌లు గ్రూప్‌-జెలో ఉన్నాయి. 

అర్జెంటీనా జట్టు:
గోల్‌కీప‌ర్స్‌: ఎమిలియానో మార్టినేజ్‌, జిరోనిమా రుల్లి, జువాన్ ముసో
డిఫెండ‌ర్స్‌: గొంజాలో మాంటిల్‌, నాహుల్ మోలినా, లిసాండ్రో మార్టినేట్‌, నికోల‌స్ ఒట‌మెండి, లియోనార్డో బార్లేడి, క్రిస్టియానా రొమారియో, ఫ‌కుండా మెదీనా, నికోల‌స్ త‌గ్లియాఫికో
మిడ్‌ఫీల్డ‌ర్లు: లియాండ్రో ప‌రేడ్స్‌, రోడ్రిగో డీ పాల్‌, ఎక్స్‌కుయ‌ల్ పాలేసియ‌స్‌, ఎంజో ఫెర్నాండేజ్‌, అలెక్సిస్ మాక్ అలిస్ట‌ర్‌, జియోవాని లో సెల్సో, వాలెంటినా బార్కో
స్ట్రైకర్లు: లియోనిల్ మెస్సి (కెప్టెన్‌) , నికోల‌స్ పాజ్‌, థియాగో అల్మ‌డా, నికోల‌స్ గొంజాలెజ్‌, జులియ‌న్ అల్వరేజ్‌, గులియానో సిమోని, లౌతారో మార్టినేజ్‌, జోస్ మాన్యువెల్ లోపేజ్

చదవండి: ‘అఫ్రిదితో పోలిక.. ఇది అవమానించడమే!’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement