‘మోదీజీ దేశం మొత్తం మీ వెనకే ఉంది.. మీ దమ్మేంటో ట్రంప్‌కు చూపించండి’ | Arvind Kejriwal criticised Narendra Modi government | Sakshi
Sakshi News home page

‘మోదీజీ దేశం మొత్తం మీ వెనకే ఉంది.. మీ దమ్మేంటో ట్రంప్‌కు చూపించండి’

Sep 7 2025 9:27 PM | Updated on Sep 7 2025 9:51 PM

Arvind Kejriwal criticised Narendra Modi government

న్యూఢిల్లీ: ‘మోదీజీ..ట్రంప్‌కు మీ దమ్మేంటో చూపించండి. యావత్‌దేశం మొత్తం మీ వెంట ఉంది’అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ప్రధాని నరేంద్ర మోదిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  

ప్రధాని నరేంద్రమోదీ ట్రంప్‌కు మీ దమ్మేంటో చూపించండి. దేశం మొత్తం మీ వెనుక ఉంది. అమెరికా మన ఎగుమతులపై 50 శాతం సుంకం విధిస్తోంది. మీరు అమెరికా దిగుమతులపై 75 శాతం సుంకం విధించండి. ట్రంప్ తలవంచుతాడో లేదో చూడండి’అని అన్నారు.

ఈ సందర్భంగా..కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమెరికా పత్తి దిగుమతులపై 11 శాతం సుంకం మినహాయింపు ఇచ్చిన నిర్ణయాన్ని కేజ్రీవాల్‌ తీవ్రంగా విమర్శించారు. అమెరికా పత్తి దిగుమతి వల్ల మన రైతులకు మార్కెట్‌లో రూ.900 కన్నా తక్కువ ధర వస్తుంది. అమెరికా రైతులు ధనవంతులు అవుతారు, గుజరాత్ రైతులు బీదవుతారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

పత్తి పంట చేతికొచ్చే సమయం అక్టోబర్-నవంబర్‌లో ఉండటంతో మార్కెట్ లేకపోవడం వల్ల రైతులు అప్పుల బారిన పడతారని, చివరికి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందన్నారు. రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి అప్పులు తీసుకున్నారు. ఇప్పుడు వారు అప్పు ఎలా తీర్చాలి?’అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ట్రంప్‌ ప్రభుత్వానికి దాసోహమైందని ఆరోపించిన కేజ్రీవాల్ .. ట్రంప్‌కు మోదీ తలవంచారు. ట్రంప్ 50 శాతం సుంకం విధించారు.  మోదీ 100 శాతం సుంకం విధించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement