లొకేషన్‌ పట్టేస్తారు.. | Govt wants mandatory GPS tracking enabled on devices | Sakshi
Sakshi News home page

లొకేషన్‌ పట్టేస్తారు..

Dec 7 2025 5:07 AM | Updated on Dec 7 2025 5:08 AM

Govt wants mandatory GPS tracking enabled on devices

మొబైల్‌ ఫోన్లలో ఏ–జీపీఎస్‌ సాంకేతికత.. తప్పనిసరి చేయాలని భావిస్తున్న కేంద్రం 

నేర విచారణ ప్రక్రియలో ముందడుగు.. అమలులోకి వస్తే తొలి దేశంగా భారత్‌

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌: అసిస్టెడ్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌.. సంక్షిప్తంగా ఏ–జీపీఎస్‌. ఈ సాంకేతికత అంశం ఇప్పుడు భారత్‌లో కొత్తగా తెరమీదకు వచ్చింది. మెరుగైన నిఘా కోసం మొబైల్‌ ఫోన్లలో శాటిలైట్‌ సిగ్నల్స్, సెల్యులార్‌ డేటా ఆధారంగా పనిచేసే ఈ లొకేషన్‌ ట్రాకింగ్‌ వ్యవస్థను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. సైబర్‌ నేరాలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో జాతీయ భద్రత ముఖ్యమన్న భావనతో ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.

 దర్యాప్తులో భాగంగా నేరస్తుల జాడను తెలుసుకోవడంలో మొబైల్‌ ఫోన్‌ లొకేషన్‌ అత్యంత కీలకం. ఈ లొకేషన్‌ తెలియ జే యాల్సిందిగా టెలికం కంపెనీ లను నిఘా సంస్థలు చట్టపరంగా అభ్యర్థించాల్సి ఉంటుంది. ప్రస్తు తం టెలికం కంపెనీలు సెల్యులార్‌ టవర్‌ డేటాను ఉపయో గించడంతో ఒక అంచనాగా మొబైల్‌ లొకే షన్‌ను అందిస్తున్నాయి. దీంతో కచ్చితమైన లొకేషన్‌ను పొందడం లేదని కొన్నేళ్లుగా దర్యాప్తు సంస్థలు అందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎట్టిపరిస్థితుల్లో ఏ–జీపీ ఎస్‌ టెక్నాలజీని అందు బాటులోకి తేవాలని భావిస్తోంది. ఇది అమలైతే ప్రపంచంలో తొలి దేశంగా భారత్‌ నిలవనుంది. ఏ–జీపీఎస్‌ కోసం స్మార్ట్‌ఫోన్లలో లొకేషన్‌ సేవలు ఎల్లప్పుడూ యాక్టివేట్‌ అయి ఉంటాయి. విని యోగదారులు వాటిని నిలిపి వేయడానికి అవకాశం ఉండదు.

ఏమిటీ ఏ–జీపీఎస్‌..
ఉపగ్రహ సంకేతాలను, సెల్‌ టవర్ల నుంచి వచ్చే సమాచారాన్ని రెండింటినీ ఉప యోగించి వేగంగా, మరింత కచ్చి తమైన స్థానాన్ని (లొకేషన్‌) ఏ–జీపీఎస్‌ అందిస్తుంది. ఉదాహర ణకు మొబైల్‌ ఫోన్‌ వాడుతున్న వ్యక్తిని సెల్‌ టవర్‌ ద్వారా ట్రాక్‌ చేసినప్పుడు.. చాలా సందర్భాల్లో లొకేషన్‌ చూపిస్తున్న ప్రాంతానికీ, వాస్తవంగా ఫోన్‌ వాడుతున్న వ్యక్తికి దూరం ఉంటోంది. గతంలో ఈ వ్యత్యాసం 16 కిలోమీటర్ల వరకు ఉండేదని సమాచారం. ఏ–జీపీఎస్‌ సాంకేతికతతో మొబైల్‌ యూజర్‌ను దాదాపు ఒక మీటర్‌ లోపల ట్రాక్‌ చేయొచ్చు. అంటే నేరస్తుడు తప్పించుకునే అవకాశమే లేదు. ముఖ్యంగా సిగ్నల్స్‌ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఈ టెక్నాలజీ చక్కని పరిష్కారం. తయారీ కంపెనీలు ఈ సాంకేతికతను మొబైల్‌ ఫోన్లలో ఇన్‌–బిల్ట్‌గా అందించాల్సి ఉంటుంది. పాత ఫోన్లకు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేస్తే సరిపోతుంది.

ఇన్‌–బిల్ట్‌ చేస్తేనే..
జియో, ఎయిర్‌టెల్‌ వంటి టెలికం కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీఓఏఐ) కేంద్ర ప్రభుత్వం ముందు ఓ ప్రతిపాదన ఉంచింది. స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు ఏ–జీపీఎస్‌ టెక్నాలజీని మొబైల్‌ ఫోన్లలో ఇన్‌–బిల్ట్‌ చేస్తేనే కచ్చితమైన లొకేషన్‌ అందించేందుకు వీలవుతుందని, తయారీ సంస్థలను ఈమేరకు ఆదేశించాలని కోరింది. ఈ ప్రతిపాదనను కేంద్ర ఐటీ, హోం శాఖలు సమీక్షిస్తున్నాయి. గోప్యత సమస్యలు తలెత్తుతాయంటూ ఈ ప్రతిపాదనకు దిగ్గజ కంపెనీలైన యాపిల్, గూగుల్, శామ్‌సంగ్‌ వ్యతిరేకిస్తున్నాయి.

సైబర్‌ నేరాల కట్టడికై..
ఇంటర్నెట్‌ వినియోగం మన దేశంలో అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు సైబర్‌ నేరాలూ అధికమవుతున్నాయి. వీటి కట్టడిలో భాగంగా నేరస్తులకు చెక్‌ పెట్టేందుకు ఏ–జీపీఎస్‌ సరైన పరిష్కారం అని కేంద్రం విశ్వసిస్తోందని టెలికం కంపెనీకి చెందిన ప్రతినిధి ఒకరు ఢిల్లీ నుంచి సాక్షితో మాట్లాడారు. ‘పౌరుల హక్కులను రక్షించడంలో ఇది కీలక అడుగు. ఏ–జీపీఎస్‌ అమలైతే ఫలితాలు చాలా సానుకూలంగా ఉంటాయి’ అని చెప్పారు.

ఆ ఫీచర్‌ను నిలిపివేయాలి..
నేరస్తుల లొకేషన్‌ ట్రాకింగ్‌ సమస్యాత్మకంగా మారుతోంది. ‘క్యారియర్‌ (టెలికం కంపెనీ) మీ స్థానాన్ని యాక్సెస్‌ చేయడానికి ప్రయత్నిస్తోంది’ అంటూ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు తమ వినియోగదారులకు పాప్‌–అప్‌ సందేశాన్ని పంపి వారిని హెచ్చరిస్తున్నాయని టెలికం కంపెనీలు వాదిస్తున్నాయి. ఇలా పాప్‌–అప్‌ మెసేజ్‌ వస్తే భద్రతా సంస్థలు తనను ట్రాక్‌ చేస్తున్నాయని యూజర్‌ సులభంగా అర్థం చేసుకుంటారని వెల్లడించాయి. పాప్‌–అప్‌ ఫీచర్‌ను నిలిపివేయాల్సిందిగా ఫోన్‌ తయారీ కంపెనీలను 
ఆదేశించాలని టెల్కోలు ప్రభుత్వాన్ని కోరాయి.

ఏ దేశంలోనూ లేదు..
ప్రతిపాదిత సేవలను తప్పనిసరి చేయకూడదని మొబైల్‌ ఫోన్ల తయారీ కంపెనీలు ప్రభుత్వానికి తెలిపాయి. పరిక రాల స్థాయిలో లొకేషన్‌ను ట్రాక్‌ చేయడం ప్రపంచంలో ఎక్కడా లేదని ఇండియా సెల్యులార్, ఎలక్ట్రానిక్స్‌ అసోసి యేషన్‌ (ఐసీఈఏ) ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాసింది. పౌరుల గోప్యతకు భంగం కలిగించే ఈ నిర్ణయానికి తాము వ్యతిరేకమని, నియంత్రణ పరంగా వంచన చేయడమేనని లేఖలో స్పష్టం చేసింది. ‘మొబైల్‌ లొకేషన్‌ను గుర్తించేందుకు ఇప్పటికే లొకే షన్‌ బేస్డ్‌ సర్వీసెస్‌ను పలు టెలికం కంపెనీలు కొన్ని ప్రాంతాల్లో అందిస్తున్నాయి. దీనికోసం టవర్‌లో సాంకేతిక మార్పులు చేస్తే చాలు. ప్రత్యేకంగా మొబైల్స్‌లో ఇన్‌బిల్ట్‌ చేయాల్సిన అవసరం లేదు’ అని ఒక సాంకేతిక నిపుణుడు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement