చైనాకు ట్రంప్ మరో షాక్.. డ్రాగన్‌పై మరోసారి టారిఫ్‌ విధింపు | USA Raised Its Tariff Rate On Chinese Imports To 145 percent | Sakshi
Sakshi News home page

చైనాకు ట్రంప్ మరో షాక్.. డ్రాగన్‌పై మరోసారి టారిఫ్‌ విధింపు

Apr 10 2025 9:35 PM | Updated on Apr 10 2025 9:55 PM

USA Raised Its Tariff Rate On Chinese Imports To 145 percent

వాషింగ్టన్‌: అమెరికా,చైనా దేశాల మధ్య టారిఫ్‌ల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా చైనాపై డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సుంకం విధించారు. దీంతో చైనా వస్తువులపై అమెరికా విధించిన టారిఫ్‌ మొత్తం 145 శాతానికి చేరుకుందని వైట్‌హౌస్‌ అధికారి అమెరికన్‌ మీడియా సంస్థ సీఎన్‌బీసీకి ధృవీకరించారు.  

అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. డ్రాగన్‌ దిగుమతులపై ఉన్న 20 శాతం సుంకాలకు అదనంగా 34 శాతం విధిస్తున్నట్లు ఇటీవల ట్రంప్‌ ప్రకటించారు. దీనిపై చైనా ‌దీటుగా స్పందిస్తూ అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం అదనపు సుంకం విధించింది. ఇదే విషయంలో ట్రంప్‌ డ్రాగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  చైనాకు డెడ్‌లైన్‌ పెట్టి.. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే 104 శాతం టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించారు. తామేం తక్కువ కాదన్నట్లుగా అమెరికా ఉత్పత్తులపై 84 శాతం సుంకం విధించింది.  

పట్టు వీడి దిగి రావాల్సింది పోయి అర్థం లేని దూకుడుగా వ్యవహరిస్తుందంటూ చైనాపై మరో 50 శాతం కలిపి మొత్తంగా 125 శాతం టారిఫ్‌ను విధిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. ఈ తరుణంలో తాజాగా మరో 20 శాతం టారిఫ్‌ పెంచారు. దీంతో చైనా దిగుమతులపై అమెరికా విధించిన సుంకం 145శాతానికి చేరినట్లైంది. ఇదే విషయాన్ని వైట్‌ హౌస్‌ వర్గాలు అధికారికంగా ప్రకటించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement