
వాషింగ్టన్: భారత్‌పై సుంకాల విషయమై అమెరికా మరోసారి స్పందించింది. ఉక్రెయిన్, రష్యా యుద్దం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యూహంలో భాగంగానే భారత్‌పై సుంకాల విధించినట్టు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ చెప్పుకొచ్చారు. రష్యాపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఇలా చేసినట్టు తెలిపారు.
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తాజాగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని ట్రంప్ నిశ్చయించుకున్నారు. ఇందులో భాగంగానే ఆయా దేశాల నేతలతో ట్రంప్ చర్చల్లో ఉన్నారు. ఇదే సమయంలో ఉక్రెయిన్‌పై దాడులు నేపథ్యంలో రష్యాతో వాణిజ్యం కొనసాగించే దేశాలపై ట్రంప్ దృష్టి సారించారు. ఆ దేశాలను లక్ష్యంగా చేసుకొని ఒత్తిడి తీసుకురావాలని అనుకున్నారు. అది ట్రంప్ పరిపాలన వ్యూహం. ఇందులో భాగంగా భారత్‌పై 50 శాతం సుంకాలను విధించారని అన్నారు. ఇదే సమయంలో భారత్ ఎప్పుడు అమెరికాకు మిత్ర దేశమే అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా భారత్- పాక్‌ల మధ్య యుద్ధాన్ని ట్రంప్ వాణిజ్యంతో ముగించారని పాత పాటే పాడారు.
మరోవైపు.. ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి సంబంధించి ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీల మధ్య సానుకూలంగా చర్చలు జరిగాయని తెలిపారు. నాటో సెక్రటరీ జనరల్‌తో సహా యూరోపియన్ నాయకులతో జరిగిన చర్చలే తొలి అడుగు అని పేర్కొన్నారు. త్వరలోనే రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకుంటుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు.
Breaking:
President Trump has put 'sanctions' on India to put 'this war (in Ukraine) to a close' & he 'wants to see this war end' says White House Spokesperson Karoline Leavitt pic.twitter.com/rLLq6aiznT— Sidhant Sibal (@sidhant) August 19, 2025