ముగిసిన ఐరాస వాతావరణ సదస్సు
బెలెమ్: బ్రెజిల్‌లోని బెలెమ్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి కాప్ 30 సదస్సు శనివారం ముగిసింది. వాతావరణ మార్పులతో తీవ్రంగా ప్రభావితమైన దేశాలకు మరిన్ని నిధులను కేటాయించేందుకు ఈ సదస్సులో దేశాల మధ్య అంగీకారం కుదిరింది. నష్టపోయిన దేశాలను ఆదుకోవాలని పిలుపునిచ్చింది. శిలాజ ఇంధనాల వినియోగాన్ని క్రమంగా తగ్గించేందుకు ఉద్దేశించిన ప్రణాళికపై నిర్ణీత కాలావధిపై దేశాలమధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. అదేవిధంగా, ఉద్గారాలను కట్టడి చేసేందుకు ఉద్దేశించిన చర్యలపైనా అంగీకారానికి రాలేకపో యాయి. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించుకునేందుకు కొలంబియాతో కలిసి రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తామని బ్రెజిల్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. కాప్ 30 ఆమోదించిన తీర్మానం మాత్రమే ప్రభావవంతమైందిగా ఉంటుందని పేర్కొంది.


