
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై రెచ్చిపోయారు. భారత్‌పై మరోసారి సుంకాన్ని భారీ మొత్తంలో విధిస్తామని హెచ్చరించారు.
గత వారం ట్రంప్ భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై 25శాతం సుంకంతో పాటు అదనంగా పెనాల్టీ విధించారు. తాజాగా, రానున్న రోజుల్లో భారత్‌పై మరింత సుంకాల్ని విధిస్తామని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్‌లో ‘రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలు చేస్తోంది. చమురును కొనుగోలు చేయడమే కాదు.. దానిని బహిరంగ మార్కెట్‌లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటుంది. రష్యా వార్ మెషిన్‌తో ఎంతమంది ఉక్రెయిన్లు ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదు. అందుకే భారత్‌పై గణనీయంగా సుంకాలు విధిస్తామని’ పేర్కొన్నారు.
రెండు రోజుల వ్యవధిలో మరోసారి టారిఫ్ విధిస్తామంటూ ట్రంప్ బెదిరింపులకు దిగడం వెనక భారత్ తీసుకున్న నిర్ణయమేనని తెలుస్తోంది. పలు జాతీయ,అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. భారత్‌పై 25శాతం ట్రంప్ సుంకం విధించారు. ట్రంప్ నిర్ణయం అనంతరం భారత్ సంస్థలు.. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేశాయని.. ఆ నిర్ణయంపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారనేది సదరు మీడియా కథనాల సారాశం.
ఈ కథనలపై కేంద్రం స్పందించినట్లు సమాచారం. దేశ ఇంధన దిగుమతులు మార్కెట్ శక్తులు. జాతీయ ప్రయోజనాల కోసం కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పునరుద్ఘటించింది. భారత చమురు సంస్థలు రష్యన్ చమురు దిగుమతులను నిలిపివేసినట్లు తమకు ఎటువంటి సమాచారం లేదని ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేసింది.
ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధంలో రష్యా ఆదాయ మార్గాలను అరికట్టేందుకు అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. భారత్-రష్యా స్థిరమైన భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నాయని తెలిపింది. ప్రస్తుత ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ద్వైపాక్షిక సంబంధాలు ముందుకు సాగుతాయని వెల్లడించింది.