అమెరికా ఫస్ట్ నినాదం.. ట్రంప్‌, మస్క్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా? | Netizens Full Funny Video Creations On Donald Trump Went Viral On Social Media, Check Videos Inside | Sakshi
Sakshi News home page

అమెరికా ఫస్ట్ నినాదం.. ట్రంప్‌, మస్క్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా?

Published Tue, Apr 15 2025 12:42 PM | Last Updated on Tue, Apr 15 2025 1:42 PM

Netizens Fully Video Creations On Donald Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టారిఫ్‌ల పేరుతో ప్రపంచదేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. అమెరికా ఫస్ట్‌ నినాదంతో పలు దేశాలను టార్గెట్‌ చేసి ఇష్టానుసారం భారీగా సుంకాలు వడ్డీస్తున్నారు. దీంతో, ఇక ప్రపంచీకరణ ముగిసినట్లేనని పలువురు దేశాధినేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక, ట్రంప్‌ మాత్రం.. అమెరికన్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలను కాపాడేందుకు ఇతర దేశాల దిగుమతులపై భారీ సుంకాలను విధిస్తున్నట్టు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. 1991లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత ప్రారంభమైన గ్లోబలైజేషన్ ఇక ముగిసినట్టే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. అలాగే, ట్రంప్ టారిఫ్‌ల నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తిని పెంచడంపై దేశాలు ఫోకస్ పెడుతున్నాయి. అటు, అమెరికా సైతం స్థానిక వనరులనే వాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా.. ఫన్నీ వీడియోలు షేర్‌ చేస్తున్నారు.

తాజా ఓ నెటిజన్‌ ట్రంప్‌, ఎలాన్‌ మస్క్‌కు చెందిన వీడియోను షేర్‌ చేశారు. ఈ వీడియోలో ట్రంప్‌, మస్క్‌లు అమెరికా అభివృద్ధి కోసం ఇప్పుడే పనులు మొదలు పెడుతున్నట్టు ఉంది. ట్రంప్‌ పొలంలో నాట్లు వేస్తూ.. మస్క్‌ చీపురుతో ఊడుస్తున్నట్టుగా, జేడీ వాన్స్‌ షూ తయారు చేస్తున్నట్టుగా వీడియోలో ఉంది.  ఇలా.. మెల్లగా పనులు చేస్తే ఎప్పటికి అమెరికా అభివృద్ధి చెందుతుంది అన్నట్టు ఫన్నీ కామెంట్స్‌ పెట్టారు.

మరో నెటిజన్‌ ట్రంప్‌, జిన్‌పింగ్‌ వీడియోను షేర్‌ చేశారు. ఈ వీడియోలో చైనా టారిఫ్‌ల దెబ్బకు ట్రంప్‌ విలవిల్లాడిపోతున్నట్టుగా ఉంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement