భారత షిప్పింగ్‌ మూలాలు పటిష్టం | Maritime fundamentals remain strong despite US tariffs | Sakshi
Sakshi News home page

భారత షిప్పింగ్‌ మూలాలు పటిష్టం

Apr 26 2025 5:50 AM | Updated on Apr 26 2025 5:50 AM

Maritime fundamentals remain strong despite US tariffs

సినర్జీ మెరైన్‌ గ్రూప్‌ సీఈవో జెస్పర్‌ 

న్యూఢిల్లీ: అమెరికా ప్రతీకార టారిఫ్‌ల వల్ల షిప్పింగ్‌ రంగంలో స్వల్పకాలికంగా కాస్త సమస్యలు తలెత్తినా, దీర్ఘకాలికంగా చూస్తే భారత మారిటైమ్‌ మూలాలు పటిష్టంగా ఉన్నాయని అంతర్జాతీయ షిప్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ సినర్జీ మెరైన్‌ గ్రూప్‌ సీఈవో జెస్పర్‌ క్రిస్టెన్సన్‌ తెలిపారు. పోర్టు సామర్థ్యాలు .. ఎగుమతుల బేస్‌ పెరుగుతుండటం, సుశిక్షితులైన సిబ్బంది లభ్యత తదితర అంశాల దన్నుతో గ్లోబల్‌ షిప్పింగ్‌ పరిశ్రమలో పరిస్థితులకు అనుగుణంగా భారత్‌ తనను తాను మల్చుకోగలిగే స్థితిలో ఉందని వివరించారు. 

బహుళ నైపుణ్యాలున్న ప్రొఫెషనల్స్‌కి షిప్పింగ్‌ రంగంలో డిమాండ్‌ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదని చెప్పారు. డిజిటలైజేషన్, డీకార్బనైజేషన్, నిబంధనలు తదితర అంశాల ఆధారంగా షిప్పింగ్‌ రంగంలో నైపుణ్యాల ఆధారంగా నియామకాలు ఉంటున్నాయని వివరించారు. సినర్జీలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 28,000 మంది సీఫేరర్స్‌ ఉండగా, వీరిలో 70 శాతం మంది భారతీయులేనని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫ్లీట్‌ విస్తరణకు అనుగుణంగస్మరిన్ని నియామకాలు చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement