breaking news
synergyse Training
-
భారత షిప్పింగ్ మూలాలు పటిష్టం
న్యూఢిల్లీ: అమెరికా ప్రతీకార టారిఫ్‌ల వల్ల షిప్పింగ్ రంగంలో స్వల్పకాలికంగా కాస్త సమస్యలు తలెత్తినా, దీర్ఘకాలికంగా చూస్తే భారత మారిటైమ్ మూలాలు పటిష్టంగా ఉన్నాయని అంతర్జాతీయ షిప్ మేనేజ్మెంట్ కంపెనీ సినర్జీ మెరైన్ గ్రూప్ సీఈవో జెస్పర్ క్రిస్టెన్సన్ తెలిపారు. పోర్టు సామర్థ్యాలు .. ఎగుమతుల బేస్ పెరుగుతుండటం, సుశిక్షితులైన సిబ్బంది లభ్యత తదితర అంశాల దన్నుతో గ్లోబల్ షిప్పింగ్ పరిశ్రమలో పరిస్థితులకు అనుగుణంగా భారత్ తనను తాను మల్చుకోగలిగే స్థితిలో ఉందని వివరించారు. బహుళ నైపుణ్యాలున్న ప్రొఫెషనల్స్‌కి షిప్పింగ్ రంగంలో డిమాండ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదని చెప్పారు. డిజిటలైజేషన్, డీకార్బనైజేషన్, నిబంధనలు తదితర అంశాల ఆధారంగా షిప్పింగ్ రంగంలో నైపుణ్యాల ఆధారంగా నియామకాలు ఉంటున్నాయని వివరించారు. సినర్జీలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 28,000 మంది సీఫేరర్స్ ఉండగా, వీరిలో 70 శాతం మంది భారతీయులేనని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫ్లీట్ విస్తరణకు అనుగుణంగస్మరిన్ని నియామకాలు చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
గూగుల్ చేతికి సినర్జీస్ స్టార్టప్
2013లో ప్రారంభించిన వరుణ్ మల్హోత్రా న్యూయార్క్: భారత సంతతి వ్యాపారవేత్త, వరుణ్ మల్హోత్రాకు సంబంధించిన బిజినెస్ టెక్నాలజీ స్టార్టప్.. సినర్జీస్ ట్రైనింగ్‌ను సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కొనుగోలు చేసింది. సినర్జీస్ పేరుతో ఉన్న ఈ స్టార్టప్‌ను వరుణ్ మల్హోత్రా 2013లో ప్రారంభించారు. గూగుల్ యాప్స్‌ను ఎలా ఉపయోగించుకోవాలో శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా ఈ స్టార్టప్‌ను అందుబాటులోకి తెచ్చారు. టొరంటో కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఈ స్టార్టప్ కొనుగోలు డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను గూగుల్ వెల్లడించలేదు. క్లౌడ్ ఆధారిత కమ్యూనికేషన్స్ అందించేలా జీమెయిల్, క్యాలెండర్, డ్రైవ్, డాక్యుమెంట్స్‌తో కూడిన గూగుల్ యాప్స్ ప్రొడక్ట్ సూట్‌ను ప్రస్తుతం 20 లక్షలకు పైగా వ్యాపార సంస్థలు, వాటి వినియోగదారులు వినియోగించుకుంటున్నారని గూగుల్ యాప్స్ సీనియర్ డెరైక్టర్(కార్యకలాపాలు) పీటర్ స్కాసిమర పేర్కొన్నారు. మరిన్ని వ్యాపార సంస్థలు ఈ గూగుల్ యాప్స్ సూట్‌ను వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని, ఈ సంస్థలు, ఈ సంస్థల వినియోగదారులకు వీటిని ఎలా వినియోగించుకోవాలో తెలిపే శిక్షణ ఆఫర్ల కోసం చూశామని పేర్కొన్నారు. దీనిని నెరవేర్చడానికి సినర్జీస్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో గూగుల్ యాప్స్‌లో ఒక భాగంగా సినర్జీస్ను అందిస్తామని పేర్కొన్నారు.