
2025–26 సంవత్సంలో 6.3 శాతమే
గత అంచనా 6.4 శాతం
అమెరికా టారిఫ్‌ల ప్రభావం కొంతే
న్యూఢిల్లీ: ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ‘ఫిచ్’ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025–26) భారత వృద్ధి అంచనాలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 6.4% వృద్ధి నమోదవుతుందన్న గత అంచనాలను సవరిస్తూ.. 6.3 శాతానికి పరిమితం అవు తుందని తాజాగా వెల్లడించింది. అమెరికా టారిఫ్‌ల ప్రభావం భారత కంపెనీలపై చూపించే ప్రత్య క్ష ప్రభావం తక్కువేనని అభిప్రాయపడింది.
‘‘మౌలిక సదుపాయాల కల్పనపై పెద్ద ఎత్తు్తన ఖర్చు చేస్తుండడం సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్ (తయారీలో వినియోగించేవి), విద్యుత్, పెట్రో లి యం ఉత్పత్తులు, స్టీల్, ఇంజనీరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలకు సానుకూలిస్తుంది’’అంటూ ‘ఇండియా కార్పొరేట్స్ క్రెడిట్ ట్రెండ్స్’ నివేదికలో ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. తాను రేటింగ్ ఇచ్చే భా రత కంపెనీల రుణ కొలమానాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగుపడతాయని, బలమైన ఎ బిటా మార్జిన్లు, అధిక మూలధన వ్యయాలను అధి గమించేందుకు అనుకూలిస్తాయని వివరించింది.
టారిఫ్‌ల ప్రభావం అధిగమించొచ్చు..
భారత కంపెనీలపై అమెరికా టారిఫ్‌ల కారణంగా పడే ప్రభావం తక్కువేనన్నది ఫిచ్ రేటింగ్ విశ్లేషణగా ఉంది. అమెరికా మార్కెట్లో వీటి ఎక్స్‌పోజర్ (వ్యాపారం) తక్కువగా ఉండడాన్ని గుర్తు చేసింది. కాకపోతే అధిక సరఫరా పరమైన రిస్క్‌లు ఎదురుకావొచ్చని పేర్కొంది. భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై తుది ఫలితం ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడింది.
భారత కంపెనీలు తమ ఎగుమతులను వైవిధ్యం చేసుకోవడం ద్వారా (ఇతర మార్కెట్లకు పెంచుకోవడం) టారిఫ్‌ల ప్రభావాన్ని అధిగమించగలవని అంచనా వేసింది. భారత్‌పై 25 శాతం టారిఫ్‌లకు అదనంగా పెనాల్టిలను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం ఇరు దేశాల మధ్య విస్తృత స్థాయి చర్చలు జరుగుతున్నప్పటికీ.. ఏకాభిప్రాయ సాధనకు సమయం తీసుకుంటోండడం గమనార్హం.
దేశీ మార్కెట్‌పైనే ప్రధానంగా ఆధారపడే ఆయిల్ అండ్ గ్యాస్, సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్, ఇంజనీరింగ్, కన్‌స్ట్రక్షన్, టెలికం, యుటిలిటీలపై టారిఫ్‌ల కారణంగా ప్రత్యక్ష ప్రభావం పెద్దగా ఉండబోదని పేర్కొంది. టారిఫ్‌ల అనిశ్చితులు కారణంగా యూఎస్, యూరప్‌కు ఐటీ, ఆటో ఎగుమతులు 2025–26లో పరిమితంగా ఉండొచ్చంటూ.. అమెరికా విధానంలో మార్పు చోటుచేసుకుంటే ఫార్మా కంపెనీలపైనా ప్రభావం పడొచ్చని అంచనా వేసింది. స్టీల్, కెమికల్స్ అధిక సరఫరాలు భారత మార్కెట్‌ను ముంచెత్తితే ఆయా రంగాల్లోని కంపెనీలు ధరలపరమైన ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని, మెటల్స్, మైనింగ్ రంగాల్లో ధరల పరంగా అధిక అస్థిరతలు ఉండొచ్చని తెలిపింది.