వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారత్‌పై ఉన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచే ఒక వార్త ఇప్పుడు హైలెట్‌గా నిలిచింది. అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో తరచూ మాట్లాడుతుంటారని, ఆయన ఇరు దేశాల వాణిజ్య చర్చలను కొనసాగిస్తారని వైట్ హౌస్ ప్రకటించింది.
‘అధ్యక్షుడు, ఆయన వాణిజ్య బృందం భారతదేశంతో చర్చలు జరుపుతోందని, ప్రధాని మోదీపై అధ్యక్షునికి అమితమైన గౌరవం ఉందని, వారు తరచూ మాట్లాడుకుంటారని’ వైట్ హౌస్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ విలేకరులతో అన్నారు. ట్రంప్ త్వరలో దక్షిణ కొరియాలో జరిగే సమావేశంలో భారతదేశంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటున్నారని కరోలిన్ లీవిట్ తెలిపారు.
కాగా భారత్.. రష్యన్ చమురు కొనుగోళ్లకు ప్రతిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత దిగుమతులపై సుంకాలను 50 శాతానికి రెట్టింపు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగజారాయి. మాస్కోలోని రెండు ప్రధాన ముడి చమురు ఎగుమతిదారులైన రోస్నెఫ్ట్, లుకోయిల్‌లపై వాషింగ్టన్ గత వారంలో ఆంక్షలు విధించింది. ఈ నేపధ్యంలో భారత శుద్ధి కర్మాగారాలు రష్యన్ చమురు దిగుమతులను తగ్గించాయి.
ఇది కూడా చదవండి: మళ్లీ భారత్‌ను టార్గెట్ చేసిన ట్రంప్


