భారత ఉత్పత్తులకు మరింత పోటీతత్వం | Union Cabinet approved the Export Promotion Mission and Credit Guarantee Scheme | Sakshi
Sakshi News home page

భారత ఉత్పత్తులకు మరింత పోటీతత్వం

Nov 14 2025 4:06 AM | Updated on Nov 14 2025 4:06 AM

Union Cabinet approved the Export Promotion Mission and Credit Guarantee Scheme

ఎంఎస్‌ంఎఈలకూ ప్రయోజనం 

ఎగుమతి ప్రోత్సాహకాలపై ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్‌లను బలంగా ఎదుర్కొనేందుకు, ఎగుమతులను పెంచుకునేందుకు కేంద్ర కేబినెట్‌ రూ.45,000 కోట్ల ప్రోత్సాహకాలతో రెండు పథకాలకు ఆమోదం తెలిపింది. రూ.25,060 కోట్లతో ఎగుమతుల ప్రోత్సాహక మిషన్‌ (ఈపీఎం), రూ.20,000 కోట్లతో క్రెడిట్‌ గ్యారంటీ స్కీమ్‌ (సీజీఎస్‌ఈ) ఇందులో ఉన్నాయి. 

ఈపీఎం అన్నది భారత ఉత్పత్తుల పోటీతత్వాన్ని పెంచుతుందని, ఎంఎస్‌ఎంఈలు, మొదటిసారి ఎగుమతిదారులు, కారి్మకులపై ఎక్కువగా ఆధారపడిన రంగాలకు ప్రయోజనం చేకూరుతుందని ప్రధాని మోదీ ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌పై ప్రకటించారు. ‘‘ప్రపంచ మార్కెట్లో భారత్‌లో తయారీ మరింత మార్మోగుతుంది. కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ స్కీమ్‌ (ఈపీఎం) ఎగుమతుల పోటీతత్వాన్ని పెంచుతుంది. 

ఎంఎస్‌ఎంఈలు, మొదటిసారి ఎగుమతిదారులు, కారి్మక ఆధారిత రంగాలకు ప్రయోజనం లభిస్తుంది’’అని పోస్ట్‌ చేశారు. క్రెడిట్‌ గ్యారంటీ స్కీమ్‌తో ఎగుమతిదారులు అంతర్జాతీయంగా మరింత పోటీపడగలరని, వ్యాపార కార్యకలాపాలను సాఫీగా నిర్వహించుకోగలరని అభిప్రాయపడ్డారు. సీజీఎస్‌ఈ పథకంతో ఎగుమతిదారులకు నగదు లభ్యత పెరుగుతుందని, ఎంఎస్‌ఎంఈలను బలోపేతం చేస్తుందని, ట్రిలియన్‌ డాలర్ల ఎగుమతుల లక్ష్యం సాధనను వేగవంతం చేస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. 

సవాళ్లకు పరిష్కారం..   
దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న రెండు ప్రధాన సమస్యలు.. అందుబాటు ధరలకే రుణాలు, నిబంధనల సంక్లిష్టత, బ్రాండింగ్‌ అంతరాయాలకు కేంద్రం ప్రకటించిన పథకాలు పరిష్కారం చూపిస్తాయని సీఐఐ ఎగుమతుల కమిటీ చైర్మన్‌ సంజయ్‌ బుధియా అభిప్రాయపడ్డారు. ఎంఎస్‌ఎంఈలకు కొత్త అవకాశాలు కలి్పస్తాయన్నారు. ‘‘రుణ లభ్యతను పెంచుతాయి. మార్కెట్‌ సన్నద్ధత, దేశ ఎగుమతులు బలపడతాయి. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. 

దేశ ఎగుమతుల వృద్ధికి తాజా ప్రేరణ లభిస్తుంది’’అని అప్పారెల్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఏఈపీసీ) వైస్‌ చైర్మన్‌ ఎ.శక్తివేల్‌ అభిప్రాయపడ్డారు. రుణ సదుపాయం, నిబంధనల అమలులో సమస్యలను ఎదుర్కొనే ఎంఎస్‌ఎంఈలకు ఈ పథకాలు సాధి కారత కలి్పస్తాయని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌ ప్రెసిడెండ్‌ ఎస్‌.సి. రల్హాన్‌ పేర్కొ న్నారు. ఎగుమతుల రంగంలో 85 శాతం ఎంఎస్‌ంఎఈలేనని, 2047 నాటికి 100 బిలియన్‌ డాలర్ల ఎగుమతుల లక్ష్యం సాధ్యపడుతుందని రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి పేర్కొంది.  

స్థిరంగా టెక్స్‌టైల్స్‌ ఎగుమతులు 
111 దేశాలకు మాత్రం 10 శాతం వృద్ధి 
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లతో కూడిన వాతావరణం మధ్య దేశ టెక్స్‌టైల్‌ ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్‌–సెపె్టంబర్‌) ఫ్లాట్‌గా నమోదయ్యాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో పోల్చి చూస్తే 0.1 శాతమే పెరిగాయి. కానీ, 111 దేశాలకు మాత్రం 10 శాతం అధికంగా 8,489 మిలియన్‌ డాలర్ల ఎగుమతులు నమోదయ్యాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ దేశాలకు ఎగుమతులు 7,718 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 

యూఏఈకి 14.5 శాతం, యూకేకి 1.5 శాతం, జపాన్‌కు 19 శాతం, జర్మనీకి 2.9 శాతం, స్పెయిన్‌కు 9 శాతం, ఫ్రాన్స్‌కు 9.2 శాతం చొప్పున ఎగుమతులు పెరిఆయి. ఈజిప్‌్టకు 27 శాతం, సౌదీ అరేబియాకి 12.5 శాతం, హాంగ్‌కాంగ్‌కు 69 శాతం అధికంగా టెక్స్‌టైల్‌ ఎగుమతులు జరిగాయి. రెడీ మేడ్‌ గార్మెంట్స్‌ (ఆర్‌ఎంజీ) ఎగుమతులు 3.4 శాతం పెరగ్గా, జ్యూట్‌ ఎగుమతులు 5.56% అధికంగా నమోదయ్యాయి. టెక్స్‌టైల్స్‌ పరిశ్రమ పోటీతత్వం, మార్పుల స్వీకరణకు ఈ పనితీరు అద్దం పడుతుందని కేంద్ర టెక్స్‌టైల్స్‌ శాఖ పేర్కొంది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement