
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం చేస్తున్న నిర్విరామ ప్రయత్నాలపై భారత్ నీళ్లు చల్లిందా? ఆ కోపంతోనే భారత్‌పై అత్యధిక సుంకాలు విధిస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి తాజాగా వెలుగులోకి వచ్చిన నివేదికలు.
భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న కుట్ర వెలుగులోకి వచ్చింది. ట్రంప్ తన వ్యక్తిగత స్వార్ధం కోసమే భారత్‌పై టారిఫ్‌లు విధిస్తున్నారని,ఇందులో దేశ ప్రయోజనాలే లేవంటూ అమెరికా ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ జెఫరీస్ ఓ నివేదికను విడుదల చేసింది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాక్‌ల మధ్య ఘర్షణను ఆపేందుకు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించేందుకు ప్రయత్నించారు. అందుకు భారత్ ఒప్పుకోలేదు. ఫలితంగా తనకు దక్కాల్సిన నోబెల్ ఫ్రైజ్ భారత్ వల్లే దూరమైందన్న అక్కుసతో ఈ టారిఫ్‌లు విధించినట్లు జెఫరీస్ తన నివేదికలో హైలెట్ చేసింది.
భారత్‌పై ట్రంప్‌కు వ్యక్తిగత కోపం ఉంది. కాబట్టే ప్రపంచంలోనే భారత్‌పై అత్యధికంగా 50శాతం సుంకాలు విధించినట్లు జెఫరీస్ నివేదిక పేర్కొంది. తద్వారా దీర్ఘకాలంగా అమెరికా-భారత్‌ల మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధాలు విచ్ఛిన్నమయ్యాయనే అభిప్రాయ వ్యక్తం చేసింది. భారత్-పాక్‌ల మధ్య ఘర్షణ వాతావరణాన్ని పూర్తిస్థాయిలో తగ్గించేలా మధ్యవర్తిత్వం వహిస్తానన్న ట్రంప్ ముందుకు రాగా.. అందుకు భారత్ ఒప్పు కోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ట్రంప్ భారత్‌పై సుంకాలు విధిస్తున్న విషయాన్ని వెల్లడించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం నానా తంటాలు పడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడ చిన్న ఘర్షణ జరిగినా.. అక్కడ వాలిపోయి పంచాయితీలు చేస్తున్నారు.తనని తాను ప్రపంచానికి శాంతి దూతగా ప్రచారం చేసుకుంటున్నారు. అదే సమయంలో తన శత్రువు బరాక్ ఒబామా.. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తొమ్మిది నెలల్లోనే నోబెల్ శాంతి బహుమతి అందుకోగా లేనిది తన విషయంలో ఎందుకు సాధ్యం కాదని ట్రంప్ ప్రశ్నిస్తున్నారు.