పసిడి ధరను నిర్దేశించే స్థాయికి భారత్‌  | India gold market is influenced by high international prices | Sakshi
Sakshi News home page

పసిడి ధరను నిర్దేశించే స్థాయికి భారత్‌ 

Nov 30 2025 5:43 AM | Updated on Nov 30 2025 11:58 AM

India gold market is influenced by high international prices

బంగారం మైనింగ్‌పై పరిశ్రమ ధీమా 

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా పసిడి ధరను నిర్దేశించే స్థాయికి భారత్‌ త్వరలో ఎదుగుతుందని పరిశ్రమ వర్గాలు ధీమా వ్యక్తం చేశాయి. రాబోయే దశాబ్దకాలంలో భారత పసిడి డిమాండ్‌లో 20 శాతం అవసరాలు దేశీయంగా బంగారం మైనింగ్‌ ద్వారా తీరుతుందని పేర్కొన్నాయి. 2047 నాటికి వికసిత్‌ భారత లక్ష్యం దిశగా దేశం ముందుకెళ్తున్న నేపథ్యంలో మైనింగ్‌ చాలా కీలకంగా ఉంటుందని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) నిర్వహించిన రత్నాభరణాల సదస్సులో పాల్గొన్న సందర్భంగా వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ రీజనల్‌ సీఈవో సచిన్‌ జైన్‌ చెప్పారు. 

పసిడి మైనింగ్‌లో ఉద్యోగాలు, విదేశీ పెట్టుబడులు గణనీయంగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. దేశీయంగా ప్రస్తుతం చెప్పుకోతగ్గ స్థాయిలో మైనింగ్, గోల్డ్‌ బ్యాంకింగ్‌ లేకపోవడం వల్ల వేరే వారు నిర్ణయించిన ధరను భారత్‌ పాటించాల్సి వస్తోందని, లండన్‌ ఏఎం, పీఎం బెంచ్‌మార్క్‌ ధరలపై ఆధారపడాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. ఆర్‌బీఐతో పాటు బ్యాంకింగ్‌ వ్యవస్థ కూడా పరివర్తన చెందే కొద్దీ ధరలపై కూడా మనం ప్రభావం చూపగలిగే అవకాశం ఉంటుందని జైన్‌ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే రెండు మూడేళ్లలో భారత్‌ అంతర్జాతీయంగా కీలకమైన జ్యుయలరీ హబ్‌గా ఎదుగుతుందని చెప్పారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement