అధిక ఒత్తిడినించి బైట పడాలంటే సుదీర్ఘ శ్వాస, ధ్యానం లేదా యోగా వంటి విశ్రాంతి పద్ధతులను పాటించడం చాలాకామన్. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి జీవనశైలిలో మార్పులు ద్వారా సుదీర్ఘ ఒత్తిడి సమస్యనుంచి బయటపడవచ్చని సాధారంగా చెప్పుకునేమాట. కానీ వీటన్నింటికే మెరుగైన పద్ధతి గురించి ఎపుడైనా ఆలోంచారా?
చాలా మంది ఒత్తిడికి గురైనప్పుడు ఆలోచించడం ఆపేయాలని.. లేదా ప్రశాంతంగా ఉండాలని అని అనుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఆందోళన పెరుగుతుంది. మనస్సును శాంతపరచుకోవడానికి.. మీ ఫీలింగ్స్ అర్థం చేసుకోవడం ముఖ్యం. ఎంత తొందరగా కొన్ని విషయాలు యాక్సెప్ట్ చేయగలిగితే అంత త్వరగా ఒత్తిడి తగ్గుతుంది. శరీరం, మనస్సు రిలాక్స్ అవ్వడం ప్రారంభిస్తాయి.
అలాగే మనసు కలత చెందితే.. పెద్ద పనుల గురించి ఆలోచించకుండా చిన్న చిన్న పనులు చేయండి. ఈ చిన్న పనులు మిమ్మల్ని అతిగా ఆలోచించడం నుంచి బయటకు తీసుకువస్తాయి.మీ మనసులో చాలా విషయాలు నడుస్తుంటే.. మీరు కొంతసేపు ఆగి.. దీర్ఘ శ్వాసలు (డీప్ బ్రీతింగ్స్) తీసుకోండి. ఆ సమయంలో ముక్కు ద్వారా నెమ్మదిగా గాలిని పీల్చుకుని నోటి ద్వారా వదలాలి.
ఇదీ చదవండి: స్మృతి-పలాష్ పెళ్లిలో మరో ట్విస్ట్ : ఇన్‌స్టాలో అప్‌డేట్ చూశారా?


