8 కిలోల వెయిట్‌ తగ్గిన టెకీ, కారణం తెలిస్తే షాకవుతారు! | Lost 8 kgs without trying Redditor credits Bengaluru traffic for improved health | Sakshi
Sakshi News home page

8 కిలోల వెయిట్‌ తగ్గిన టెకీ, కారణం తెలిస్తే షాకవుతారు!

Jan 23 2026 7:23 PM | Updated on Jan 23 2026 7:38 PM

Lost 8 kgs without trying Redditor credits Bengaluru traffic for improved health

భారతదేశ టెక్ రాజధాని బెంగళూరు భారీ ట్రాఫిక్‌తో అల్లాడిపోతోంది. నెదర్లాండ్స్‌కు చెందిన లొకేషన్ టెక్నాలజీ కంపెనీ టామ్‌టామ్ ప్రచురించిన తాజా ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం, 2025లో బెంగళూరు ప్రపంచంలోనే రెండవ అత్యంత రద్దీ నగరంగా పేరుపొందింది. దీంతో సామాన్య ప్రజలతో పాటు, కార్పొరేట్‌  ఉద్యోగులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ  కావు.  అయితే ట్రాఫిక్‌ మూలంగా  విపరీతంగా బరువు తగ్గిపోయాను అని ఒక టెకీ వాపోతే, దాని ఆరోగ్యం మెరుగైందని  మరొకరు వాదించిన వైనం నెట్టింట  వైరల్‌గా మారింది.


నగర ట్రాఫిక్‌, వ్యక్తిగత ఆరోగ్య ప్రభావంపై రెడ్డిట్ పోస్ట్  అందరి దృష్టిని ఆకర్షించింది. దీని ప్రకారం  వైట్‌ఫీల్డ్ నుండి కోరమంగళకు ఒకప్పుడు ఒక ప్రొఫెషనల్ రోజువారీ ప్రయాణం దాదాపు 90 నిమిషాలు. అంటే గంటన్నర.  ఇలా రోడ్డుపై ఎక్కువ గంటలు ఉండటం వల్ల తన  లైఫ్‌ స్టైల్‌. ఆరోగ్యం, దెబ్బతిన్నదని ఆయన రాసుకొచ్చారు.  పని ఒత్తిడితో డెస్క్‌ దగ్గరే  భోంచేయడంతో కనీసం వ్యాయామం కూడా  లేకుండా పోయిందని వెల్లడించాడు. రోజులో ఎక్కువ భాగం అయితే డెస్క్ వద్ద లేదా ట్రాఫిక్‌లో కూర్చుని  గడపాల్సి వచ్చేది.  కాలక్రమేణా, ఒత్తిడి  పెరిగిపోయిందట. వ్యాయామమే లేదని చెప్పాడు.

బెంగళూరు ట్రాఫిక్ మారలేదుగానీ ఆరోగ్యంపై ప్రభావం మాత్రం స్పష్టంగా ఉందని తెలిపారు. విశ్రాంతి హృదయ స్పందన రేటు 82 నుండి 64కి తగ్గిందని,బరువు తగ్గడానికి  ఎలాంటి ప్రయత్నం చేయకుండానే  దాదాపు ఎనిమిది కిలోల బరువు తగ్గానని  పేర్కొన్నాడు. అయితే ప్రతి వారంలో ఆఫీసుకు వెళ్లే బదులు, వారానికి మూడు రోజులు వర్క్‌ ఫ్రం హోం విధానంకాస్త ఊరటిచ్చిందని పేర్కొన్నారు. ఈ వెసులుబాటు కారనంగా రోజూ ఉదయం జిమ్‌కెళ్లడం, ఫుడ్‌డెలివరీపై ఆధారపడకుండా సమీపంలోని రెస్టారెంట్‌లకు నడవడం లాంటివి రోజువారీ దినచర్యగా సహజంగా అలవడ్డాయని చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి: చిన్నారిని ఎత్తుకెళ్లి బావిలో పడేసిన కోతి, కాపాడిన డైపర్‌

దీంతో చాలామంది తమ అనుభవాలను కూడా పంచుకున్నారు. “నేను ఒక సంవత్సరం పాటు బస్సులో ప్రయాణించాను. రెండు స్టాప్‌లలో బస్సులు మారుతూ 45 నిమిషాల ఒకవైపు ప్రయాణం చేసేవాడిని. ఆసమయంలో నిజంగా ఆరోగ్యంగా, రిలాక్స్‌గా ఉన్నాను.” అని ఒకరు వ్యాఖ్యానించగా దీన్ని కొంతమంది విభేదించారు. బెంగళూరు వంటి నగరాలకు ఇంటి నుంచి పనిచేసే విధానం మంచిదని వ్యాఖ్యానించారు. ప్రయాణానికి వెచ్చించే సమయానికి బదులుగా జిమ్‌కు  వెళ్లవచ్చిన సూచించారు.

ఇదీ చదవండి: శవం సడెన్‌గా కాళ్లు పైకి లేపింది...ఇదిగో వీడియో!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement