
34.2 లక్షల కోట్ల డాలర్లకు జీడీపీ
2038కల్లా చేరుకోనున్నట్లు ఈవై అంచనా
కొనుగోలు శక్తి రీత్యా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించే వీలున్నట్లు ఈవై నివేదిక అంచనా వేసింది. వెరసి 2038కల్లా దేశ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 34.2 లక్షల కోట్ల డాలర్లకు చేరనున్నట్లు ఎకానమీ వాచ్ పేరుతో ఆగస్టు నెలకు విడుదల చేసిన నివేదికలో అభిప్రాయపడింది. ఈ బాటలో 2030కల్లా దేశ జీడీపీ 20.7 ట్రిలియన్ డాలర్లను తాకనున్నట్లు పేర్కొంది. తగిన చర్యలు చేపట్టడం ద్వారా ఎంపిక చేసిన దిగుమతులపై యూఎస్ విధించిన అధిక టారిఫ్‌ల ప్రభావాన్ని తగ్గించుకోగలదని తెలియజేసింది.
ఇదీ చదవండి: నెట్‌వర్క్ విస్తరణలో అమెజాన్
వాస్తవిక జీడీపీ వృద్ధిపై 0.1 శాతానికి పరిమితం చేసుకోగలదని వివరించింది. ప్రపంచంలోని 5 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన భారత్ అత్యంత శక్తివంతంగా మారుతున్నట్లు పేర్కొంది. పటిష్ట ఆర్థిక మూలాలు, గరిష్ట పొదుపు, పెట్టుబడుల రేటు, సానుకూల జనాభా, ద్రవ్య పరిస్థితుల్లో నిలకడ వంటి అంశాలు ఇందుకు తోడ్పాటునివ్వనున్నట్లు వివరించింది. టారిఫ్ ఒత్తిళ్లు, వాణిజ్య మందగమనం వంటి అంతర్జాతీయ అనిశ్చితులున్నప్పటికీ దేశీ డిమాండ్, ఆధునిక టెక్నాలజీలలో సామర్థ్యాల పెంపు తదితరాలు మద్దతివ్వనున్నట్లు తెలియజేసింది.