
12 ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు
6 సార్టింగ్ సెంటర్లు ప్రారంభం
పండుగ సీజన్ డిమాండ్‌కి తగ్గట్లు సర్వీసులు అందించే దిశగా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ తన నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరించింది. కొత్తగా 12 ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు (స్మార్ట్ గిడ్డంగులు), ఆరు సార్టింగ్ సెంటర్లను ప్రారంభించింది. దీనితో దాదాపు ఒలింపిక్ గేమ్స్ స్థాయి 100 స్విమ్మింగ్ పూల్స్‌కి సమానమైన 86 లక్షల ఘనపుటడుగుల నిల్వ సామర్థ్యం అందుబాటులోకి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. వైజాగ్, కృష్ణగిరి తదితర అయిదు నగరాల్లో తొలిసారిగా ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు వివరించింది.
ఇదీ చదవండి: పిల్లల ఆధార్ అప్‌డేట్.. యూఐడీఏఐ లేఖ
త్రివేండ్రం, రాజ్‌పురా తదితర ఆరు ప్రాంతాల్లో సోర్ట్ సెంటర్లను నెలకొల్పినట్లు తెలిపింది. కొనుగోలుదారులకు మరింత వేగంగా ఉత్పత్తులను అందించడానికి విక్రేతలకు ఇవి ఉపయోగపడతాయని వివరించింది. వీటితో ఫుల్‌ఫిల్‌మెంట్, సోర్టేషన్ అసోసియేట్స్, టీమ్ లీడ్స్, ప్రాసెస్ అసిస్టెంట్స్‌లాంటి వేల కొద్దీ ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్ ఉద్యోగాల కల్పనకు వీలవుతుందని అమెజాన్ పేర్కొంది.