
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌ల విషయంలో స్వదేశం నుంచే తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రంప్ చర్యలను ఇప్పటికే పలువురు నేతలు తప్పుపట్టగా.. తాజాగా ఆ లిస్టులో అమెరికా జాతీయ మాజీ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ కూడా చేరిపోయారు. ట్రంప్ సుంకాల నిర్ణయాల కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ బ్రాండ్ టాయిలెట్‌లో ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమెరికా జాతీయ మాజీ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్ చర్యలు అమెరికాకు తీరని నష్టం కలిగిస్తోంది. మిత్ర దేశాలతో సహా ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పుడు అమెరికాకు భాగస్వామిగా ఉండేందుకు ఇష్టపడటం లేదు. పలు దేశాలు అమెరికాను తమకు విఘాతం కలిగించే దేశంగా చూస్తున్నారు. ట్రంప్ చర్యలు చైనాకు అనుకూలంగా మారుతున్నాయి. ఇప్పటికే అనేక దేశాలు చైనా వైపు చూస్తున్నాయి. ట్రంప్ తప్పుల కారణంగా భారత్ కూడా చైనా వైపు చూస్తోంది.
అమెరికాకు మిత్ర దేశమైన భారత్‌పై పెద్ద మొత్తంలో సుంకాలు విధించడంతో.. ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో, భారత్.. బీజింగ్‌తో భాగస్వామ్యం బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ బ్రాండ్ టాయిలెట్‌లో ఉంది. భారత్‌పై ట్రంప్ భారీ వాణిజ్య దాడి చేశారు. అమెరికాకు వ్యతిరేకంగా ఢిల్లీ ఇప్పుడు చైనాతో కలవాలని చూస్తోంది అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో.. భారత్‌పై ట్రంప్ 50శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
“The American brand globally is in the toilet. Look at India. Trump has executed a massive trade offensive against them. Now, India is thinking shit we have to go sit down with China to hedge against America,” says former US NSA Jake Sullivan on the Bulwark podcast pic.twitter.com/x6bHureqpk
— Shashank Mattoo (@MattooShashank) August 29, 2025