
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు సంచలన ప్రకటన చేశారు. ఇటీవల కరేబియన్‌లో అమెరికా జరిపిన సైనిక దాడిలో ఒక భారీ మాదకద్రవ్యాల జలాంతర్గామి ధ్వంసమైందని, ఈ దాడిలో ఇద్దరు నార్కో ఉగ్రవాదులను హతం చేశామని, మరో ఇద్దరిని సజీవంగా పట్టుకున్నామని తెలిపారు. ఈ దాడికి సంబంధించిన వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో.. ‘ఆ జలాంతర్గామిలో అధికంగా ఫెంటానిల్ తదితర మాదకద్రవ్యాలు ఉన్నాయని, అది నార్కోట్రాఫికింగ్ ట్రాన్సిట్ రూట్ ద్వారా అమెరికా వైపు వస్తున్నదని, దానిని అడ్డగించడం ద్వారా 25 వేల అమెరికన్ల మరణాలను నిరోధించగలిగానని’ ట్రంప్ పేర్కొన్నారు.
తన సోషల్ మీడియా పోస్టులో ట్రంప్.. ‘ఒక భారీ మాదకద్రవ్యాల జలాంతర్గామిని నాశనం చేయడమనేది నాకు లభించిన గొప్ప గౌరవం. ఓడలో అధికంగా ఫెంటానిల్ ఉందని యూఎస్ ఇంటెలిజెన్స్ నిర్ధారించింది. ఆ జలాంతర్గామిలో నలుగురు నార్కోటెర్రరిస్టులు ఉన్నారు. వారిలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సజీవంగా ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను వారి స్వదేశాలైన ఈక్వెడార్, కొలంబియాకు విచారణ కోసం తిరిగి పంపుతున్నారు’ అని పేర్కొన్నారు.
ఈ దాడి తర్వాత అమెరికా నావికాదళం ఇద్దరు ఉగ్రవాదులను ప్రాణాలతో పట్టుకుందని, వారిని ఒక అమెరికన్ యుద్ధనౌకలో ఉంచిందని ఫాక్స్ న్యూస్ ధృవీకరించింది. కాగా గత నెలలో కరేబియన్‌లో యుద్ధ కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుండి అమెరికా అనుమానిత మాదకద్రవ్యాల అక్రమ రవాణా నౌకలను అడ్డగించడం ఇది ఆరోసారి. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ తగిలిందని చెబుతున్న అమెరికా అధికారులు.. ఈ దాడుల్లో హతమైన 27 మంది మాదకద్రవ్యాల స్మగ్లర్లే అని ధృవీకరించే ఎటువంటి ఆధారాలను మీడియాకు అందించలేదు. ఈ రీతిలో అంతమొందించడం చట్టవిరుద్ధమని నిపుణులు వాదిస్తున్నారు.
📹 DESTROYED: Confirmed DRUG-CARRYING SUBMARINE navigating towards the United States on a well-known narcotrafficking transit route.
"Under my watch, the United States of America will not tolerate narcoterrorists trafficking illegal drugs, by land or by sea." - President Trump pic.twitter.com/N4TAkgPHXN— The White House (@WhiteHouse) October 18, 2025