అమెరికాపై ప్రతీకార సుంకాలు 90 రోజులు వాయిదా | EU suspends retaliatory 25percent tariffs on US goods after Trump U-turn | Sakshi
Sakshi News home page

అమెరికాపై ప్రతీకార సుంకాలు 90 రోజులు వాయిదా

Apr 11 2025 5:15 AM | Updated on Apr 11 2025 5:15 AM

EU suspends retaliatory 25percent tariffs on US goods after Trump U-turn

యూరోపియన్‌ యూనియన్‌ ప్రకటన 

బ్రస్సెల్స్‌: అమెరికా ఉత్పత్తులపై ప్రతీకార సుంకాల అమలును 90 రోజులపాటు నిలిపివేస్తున్నట్లు యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) ఎగ్జిక్యూటివ్‌ కమిషన్‌ గురువారం వెల్లడించింది. తమ ఉత్పత్తులపై విధించిన టారిఫ్‌లను 90 రోజులు నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తాము సైతం ఆయన బాటలో నడవనున్నట్లు ప్రకటించింది. టారిఫ్‌ల విషయంలో అమెరికాతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డెర్‌ లెయెన్‌ గురువారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. 

23.25 బిలియన్‌ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తూ ఇప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని చెప్పారు. అమెరికాలో చర్చలకు ఒక అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్ఘాటించారు. చర్చలు సంతృప్తికరంగా సాగకపోతే అమెరికాపై ప్రతీకార సుంకాలు కచ్చితంగా అమల్లోకి వస్తాయని స్పష్టంచేశారు. ఈయూ నుంచి దిగుమతి అయ్యే స్టీల్, అల్యూమినియంపై ట్రంప్‌ తొలుత 25 శాతం టారిఫ్‌ విధించిన సంగతి తెలిసిందే. దీన్ని 90 రోజులపాటు ఆయన నిలిపివేశారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement