టారిఫ్‌లకు పది వారాల్లో పరిష్కారం  | India-U.S. tariff issues likely in eight to 10 weeks | Sakshi
Sakshi News home page

టారిఫ్‌లకు పది వారాల్లో పరిష్కారం 

Sep 19 2025 5:16 AM | Updated on Sep 19 2025 8:05 AM

India-U.S. tariff issues likely in eight to 10 weeks

నవంబర్‌ చివరికి 25 శాతం ఎత్తేయొచ్చు

10–15 శాతానికి ప్రతీకార సుంకం 

రూపాయి బలంగా నిలబడుతుంది 

సీఈఏ అనంత నాగేశ్వరన్‌ 

కోల్‌కతా: అమెరికా టారిఫ్‌లకు వచ్చే ఎనిమిది, పది వారాల్లో పరిష్కారం లభిస్తుందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) అనంత నాగేశ్వరన్‌ చెప్పారు. 25 శాతం ప్రతీకారం సుంకం, రష్యా నుంచి చమురు కొంటున్నందుకు విధించిన 25 శాతంతో కలిపి భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం టారిఫ్‌లు అమలు చేస్తుండడం తెలిసిందే. భారత్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి నాగేశ్వరన్‌ మాట్లాడారు. 

భారత ఉత్పత్తులపై టారిఫ్‌లను అమెరికా వెనక్కి తీసుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య అంతర్గతంగా చర్చలు కొనసాగుతున్నాయంటూ, వచ్చే 8–10 వారాల్లో పరిష్కారం లభించొచ్చన్నారు. ‘‘భారత్‌పై విధించిన 25 శాతం పీనల్‌ టారిఫ్‌ను నవంబర్‌ చివరి నాటికి అమెరికా ఉపసంహరించుకోవచ్చు. నవంబర్‌ 30 తర్వాత ఉండకపోవచ్చు. ఇటీవలి పరిణామాల ఆధారంగా ఇది కేవలం నా అంచనాయే. 

ప్రస్తుతమున్న 25 శాతం ప్రతీకార సుంకం సైతం 10–15 శాతానికి తగ్గొచ్చు’’అని సీఈవో తన అభిప్రాయాలను వెల్లడించారు. ఒకవేళ టారిఫ్‌లు కొనసాగితే అమెరికాకు ఎగుమతులు తగ్గుతాయన్నారు. భారత్‌ మధ్యస్థ ఆదాయ దేశమని, మొదటి త్రైమాసికంలో జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు చెప్పారు. కరోనా విపత్తు తర్వాత ఎన్నో దేశాలతో పోల్చితే భారత ఆర్థిక వ్యవస్థ ఎంతో వేగవంతమైన వృద్ధిని సాధించినట్టు తెలిపారు.  

తయారీ, వ్యవసాయం, సేవల పాత్ర 
వచ్చే రెండేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో తయారీ, సేవలు, వ్యవసాయ రంగంలో గొప్ప పాత్ర పోషిస్తాయని నాగేశ్వరన్‌ చెప్పారు. అలాగే, వినియోగం, పెట్టుబడులు వృద్ధికి ఊతంగా నిలుస్తాయన్నారు. జీడీపీలో భారత రుణ నిష్పత్తి సహేతక స్థాయిలోనే ఉన్నట్టు చెప్పారు. ఇతర దేశాల కంటే మెరుగైన వృద్ధిని సాధిస్తున్నామని, నిధులను సమర్థవంతంగా వినియోగించుకుంటున్న దానికి ఇది సంకేతంగా పేర్కొన్నారు.  

గ్రామీణ వినియోగం బలంగా ఉందంటూ, అదే సమయంలో పట్టణ డిమాండ్‌ పుంజుకుంటున్నట్టు చెప్పారు. ఇటీవలి జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో వినియోగదారుల చేతుల్లో ఖర్చు చేసే ఆదాయం మిగులు పెరుగుతుందని, దీంతో పట్టణ వినియోగం సైతం ఇతోధికం అవుతుందని అంచనా వేశారు. ఎంఎస్‌ఎంఈ రంగానికి రుణ సాయం పెరుగుతోందని, పెద్ద పరిశ్రమలకు రుణాల్లో నిర్మాణాత్మక మార్పు కనిపిస్తోందన్నారు.

 నేటి రోజుల్లో నిధుల సమీకరణకు ఎన్నో మార్గాలు అందుబాటులోకి వచి్చనట్టు చెప్పారు. ఎగుమతులు బలంగా కొనసాగుతున్నట్టు నాగేశ్వరన్‌ తెలిపారు. మొదటి త్రైమాసికంలో కరెంట్‌ ఖాతా లోటు జీడీపీలో 0.2 శాతానికి పరిమితమైనట్టు చెప్పారు. ‘‘డాలర్‌తో రూపాయి విలువ క్షీణిస్తోంది. 

దేశ ఆర్థిక వ్యవస్థలో అంతర్గతంగా ఉన్న బలం దృష్ట్యా దీర్ఘకాలంలో రూపాయి తన విలువను కాపాడుకుని, బలంగా నిలబడుతుంది’’అని నాగేశ్వరన్‌ దేశ ఆర్థిక వ్యవస్థను విశ్లేíÙంచారు. దేశ ప్రైవేటు రంగం పరిశోధన, అభివృద్ధిపై పెట్టుబడులను మరింతగా పెంచాలని, మరిన్ని ఆవిష్కరణలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కృత్రిమ మేథ (ఏఐ) ఉపాధి పరంగా పెద్ద అవరోధం కాదన్నారు. ఉద్యోగులు తమ నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement