బ్రిటిష్ లగ్జరీ కార్ల బ్రాండ్ నుంచి బీఎండబ్ల్యు ఏజీ కింద భారతదేశంలో లాంచ్ అయిన.. లేటెస్ట్ కారు 'మినీ కూపర్ కన్వర్టిబుల్' వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందనను పొందింది. డిసెంబర్ 12న ఇండియన్ మార్కెట్లో ప్రారంభమైన ఈ మోడల్ మొదటి బ్యాచ్ బుకింగ్స్ 24 గంటల్లో పూర్తయ్యాయి.
మినీ కూపర్ కన్వర్టిబుల్ ప్రారంభ ధర రూ. 58.50 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీనికి సంస్థ మన దేశానికి సీబీయూ మార్గం ద్వారా దిగుమతి చేసుకుంటుంది. ఈ కారణంగానే దీని ధర కొంత ఎక్కువగా ఉంటుంది.
మినీ కూపర్ కన్వర్టిబుల్ ధర సాధారణ కార్ల కంటే కొంత ఎక్కువే అయినప్పటికీ .. కొనుగోలుదారులు మాత్రం వెనక్కి తగ్గకుండా బుక్ చేసుకున్నారు. తరువాత బ్యాచ్ బుకింగ్స్ వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రారంభం కానున్నాయి. ప్రీమియం ఫీచర్స్ పొందిన ఈ కారు నాలుగు వేర్వేరు రంగులలో లభిస్తుంది.
ఇదీ చదవండి: అందుకే.. ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్‌కు డిమాండ్!
కొత్త మినీ కూపర్ కన్వర్టిబుల్ సిగ్నేచర్ మినీ సిల్హౌట్ పొందుతుంది. దీని ముందు భాగంలో రౌండ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, కొత్త రేడియేటర్ గ్రిల్ లేఅవుట్ చూడవచ్చు. ఇది 18-అంగుళాల ఏరోడైనమిక్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. వెనుక భాగంలో, ఇది ఫ్లష్ సర్ఫేస్ స్టైలింగ్‌లో పూర్తయిన ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ కనిపిస్తాయి.


