70వేల మంది కొన్న కారు ఇది.. | Maruti Suzuki Victoris Hits 70000 Bookings | Sakshi
Sakshi News home page

70వేల మంది కొన్న కారు ఇది..

Jan 4 2026 7:09 PM | Updated on Jan 4 2026 7:25 PM

Maruti Suzuki Victoris Hits 70000 Bookings

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయినప్పటి నుంచి మారుతి సుజుకి.. తన విక్టోరిస్ కారు కోసం 70,000 బుకింగ్స్ అందుకుంది. కాగా అందులో 35వేలు కంటే ఎక్కువ డెలివరీలు పూర్తి చేసింది.

గత ఏడాది దేశీయ విఫణిలో లాంచ్ అయిన మారుతి సుజుకి విక్టోరిస్.. అరీనా డీలర్‌షిప్ నెట్‌వర్క్‌కు ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా ఉంది. దీని ధరలు రూ. 10.50 లక్షల నుంచి రూ. 19.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.

మారుతి సుజుకి విక్టోరిస్ చూడటానికి కొంత.. గ్రాండ్ విటారా మాదిరిగా ఉంటుంది. ఇవి రెండూ కూడా ఒకే రకమైన ఛాసిస్ & ఇంజిన్ ఎంపికలను పొందుతాయి. కాబట్టి విక్టోరిస్ 1.5L నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ &1.5L స్ట్రాంగ్-హైబ్రిడ్ ఇంజన్ ఎంపికలలో అమ్మకానికి ఉంది.

ఇదీ చదవండి: ఇన్నోవా క్రిస్టాకు కౌంట్‌డౌన్!.. నిలిపివేతా?

విక్టోరిస్ కారులో.. గ్రాండ్ విటారాలో అందుబాటులో లేని అనేక ఫీచర్స్ ఉన్నాయి. అందులో లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS), 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, డాల్బీ అట్మాస్‌తో కూడిన 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, యాంబియంట్ లైటింగ్ మొదలైనవి ఉన్నాయి. వీటితో పాటు.. హ్యాండ్స్-ఫ్రీ జెస్టర్-కంట్రోల్డ్ పవర్డ్ టెయిల్‌గేట్, 8 వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు కూడా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement