భారత్‌కు ట్రంప్‌ భారీ షాక్‌! | How India Effected With Trump 100 Percent Tariff On Pharmaceutical Drugs, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

భారత్‌కు ట్రంప్‌ భారీ షాక్‌!

Sep 26 2025 7:06 AM | Updated on Sep 26 2025 9:53 AM

How India Effected With Trump 100 Percent Tariff On Pharmaceutical Drugs

సుంకాల యుద్ధంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump) మరో బాంబు పేల్చారు. ఈసారి ఫార్మా దిగుమతులపై భారీగా సుంకాలను ప్రకటించారు(Impose New Tariffs). బ్రాండెడ్, పేటెంట్ ఉన్న ఔషధ ఉత్పత్తుల దిగుమతులపై ఏకంగా 100 శాతం వరకు టారిఫ్‌లు విధిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయం భారత ఫార్మాస్యూటికల్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది.

ఈ చర్యలు అమెరికాలో తయారీని ప్రోత్సహించడమే లక్ష్యంగా తీసుకున్నవిగా ట్రంప్ పేర్కొన్నారు. అప్‌హోస్టర్డ్ ఫర్నిచర్‌పై 30 శాతం, భారీ ట్రక్కులపై 25 శాతం దిగుమతి సుంకాలు విధించనున్నట్లు వెల్లడించారు. అలాగే బ్రాండెడ్‌ , పేటెంటెడ్‌ డ్రగ్స్‌పై(pharmaceutical products) ఏకంగా 100 శాతం విధిస్తామని స్పష్టం చేశారు. అయితే.. అమెరికాలో ప్లాంట్‌లను నిర్మిస్తున్న విదేశీ ఔషధ తయారీ సంస్థలకు సుంకాలు వర్తించదన్నారు. ఈ నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తీసుకొస్తామని ట్రూత్‌ సోషల్‌ మీడియా ద్వారా ట్రంప్‌ తెలిపారు.  

భారతంపై ప్రభావం..
భారత ఔషధ కంపెనీలకు అమెరికా అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానం. 2024లో భారత్‌ 27.8 బిలియన్‌ డాలర్ల విలువైన ఔషదాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసింది. అందులో సుమారు భారత్‌ 3.6 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలనే అమెరికాకు ఎగుమతి చేసింది.  అయితే ఈ ఏడాది మొదటి అర్ధ భాగంలోనే దాదాపు 3.7 బిలియన్ డాలర్ల ఎగుమతులు అమెరికాకు వెళ్లడం గమనార్హం. 

ట్రంప్‌ విధించిన తాజా సుంకాలు బ్రాండెడ్, పేటెంట్ ఉన్న ఔషధాలపై వర్తిస్తాయన్నది స్పష్టత వచ్చింది. సాధారణంగా భారత్‌ అమెరికాకు ఎగుమతి చేసే మందుల్లో జనరిక్‌ ఔషదాలే ఎక్కువ. అయితే ట్రంప్‌ తాజా నిర్ణయం స్పెషాలిటీ డ్రగ్స్‌ తయారీ చేస్తున్న భారత మల్టీనేషనల్‌ కంపెనీలపై ఈ ప్రభావం పడనుంది. ఈ నిర్ణయం భారత ఔషధ పరిశ్రమను గట్టి దెబ్బే కొట్టవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సిప్లా, డివిస్‌ లాబ్స్‌, అజంత ఫార్మా, అలాగే.. నిఫ్టీ ఫార్మా స్టాక్స్‌పై టారిఫ్‌ ఎఫెక్ట్‌ కనిపిస్తోంది.  

మరింత తప్పదు!
ఇప్పటికైతే 100 శాతం సుంకాలు ప్రకటించిన ట్రంప్‌.. భవిష్యత్తులో మరింత పెంచే అవకాశాలు లేకపోలేదని హెచ్చరించారు. ఆ సుంకాలు 150% నుంచి 250% వరకు ఉండే అవకాశం ఉంది. ఇక.. అమెరికాలో తయారీ ప్లాంట్లు నిర్మిస్తున్న కంపెనీలకు ట్రంప్‌ మినహాయింపు ఇచ్చారు. అయితే అమెరికాలో తయారీ ప్లాంట్లు నిర్మిస్తున్న ఉన్న కంపెనీలకు ఈ సుంకాలు వర్తించవని అన్నారు. దీంతో ఇప్పటికే ప్లాంట్లు ఉన్న కంపెనీలకు మినహాయింపు వర్తిస్తుందా అనే విషయంలో స్పష్టత కొరవడింది.
ఇదీ చదవండి: ‘ఇడియట్‌ ట్రంప్‌’పై సుందర్‌ పిచాయ్‌ ఏమన్నారంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement