cash award
-
40 ఏళ్ల సేవలు, రూ. 35 లక్షలు..ఎన్ఆర్ఐకి అరుదైన గౌరవం!
ఒక ఉద్యోగికగా తాను చేసిన సేవలకు గుర్తింపు లభించడం అంటే ఆస్కార్ వరించినంత ఆనందం. అది వ్యక్తిగత లేదా,బహిరంగ ప్రశంస అయినా, అవార్డులు, రివార్డు, నగదు బహుమతి అయినా, ఏదైనా ఎంత చిన్నదైనా కూడా గొప్ప గౌరవమే. అది వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే కాదు, నిబద్దతను పెంచుతుంది. తమ కృషికి విలువ లభిస్తుందనే భావన, ఆరోగ్యకరమైన పోటీ, పనితీరును మెరుగుకు దారితీస్తుంది. అంతిమంగా ఇది సంస్థకు ఎనలేని మేలు చేస్తుంది. ఇపుడు ఇదంతా ఎందుకూ అంటే.. భారత సంతతి వ్యక్తికి తన సంస్థనుంచి లభించిన అరుదైన గౌరవంగా నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.మెరికాలోని మసాచుసెట్స్‌లో ఉన్న మెక్‌డొనాల్డ్స్‌లో పనిచేస్తున్న భారత సంతతికి చెందిన ఉద్యోగి బల్బీర్ సింగ్‌ను సంస్థ చాగా గొప్పగా సత్కరించుకుంది 40 ఏళ్ల పాటు అంకిత భావంతో పనిచేసిన మెక్‌డొనాల్డ్స్ ఫ్రాంచైజ్ లిండ్సే వాలిన్కు సుమారు రూ. 35 లక్షల బహుమతిని (40 వేల డాలర్లు) అందించింది. ఈవెంట్ వేదిక వద్దకు బల్బీర్ సింగ్‌ను లిమోజిన్ కారులో తీసుకువచ్చి, రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలికి మరీ దీనికి సంబంధించిన చెక్కును అందించారు. అలాగే సేవా పురస్కారం, స్మారక "వన్ ఇన్ ఎయిట్" జాకెట్నుకూడా అందుకున్నారు. ఈసందర్బంగా ఫ్రాంచైజ్ యజమాని లిండ్సే వాలిన్ మాట్లాడుతూ, బల్బీర్ సింగ్ తమ సంస్థకు గుండెలాంటి వారని కొనియాడారు. మొత్తం తొమ్మిది అవుట్లెట్లను కలిగి ఉన్న లిండ్సే వాలిన్, సింగ్ ఈ విజయాన్ని ఇతర ఉద్యోగులతో ఘనంగా సెలబ్రేట్ చేశారు. బల్బీర్ తనతో కలిసి చేసిన 40 ఏళ్ల ప్రయాణం గురించి చెప్పలేమని చెప్పలేననీ, తొమ్మిది రెస్టారెంట్లలో నాలుగు రెస్టారెంట్లను చాలా గొప్పగా, అచంచల దృష్టితో నడుపుతున్నాడు ఆమె ప్రశంసించారు. చదవండి: H-1B వీసాలు ట్రంప్ దెబ్బ : టాప్‌లో ఆ కంపెనీల జోరుబల్బీర్ సింగ్ కెరీర్బల్బీర్ సింగ్ 40 ఏళ్ల క్రితం భారతదేశం నుండి అమెరికాకు వచ్చిన కొద్ది రోజులకే మెక్‌డొనాల్డ్స్‌లో కెరీర్ ప్రారంభించారు. తొలుత 1985లో సోమర్విల్లేలోని రెస్టారెంట్ కిచెన్‌లో పనిచేశారు. అలా కష్టపడి, పూర్తి నిబద్ధతతో పనిచేసి, ఒక్కో మెట్టు ఎదుగుతూ తాను పనిచేస్తున్న సంస్థలోని తొమ్మిది రెస్టారెంట్లలో నాలుగుంటిని పర్యవేక్షించే స్థాయికి చేరుకోవడం విశేషం. మొదట బల్పీర్ సింగ్ తన తండ్రి బాబ్కింగ్ వద్ద పనిచేసేవారని కంపెనీ మోటో అయిన వై నాట్ అనే పద్ధతిని స్వీకరించారని, ఇంకా ఎదగాలి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న ఆలోచనా విధానమే మా విజయానికి కారణమని లిండ్సే వాలిన్. మరోవైపు ఈ కంపెనీలో పనిచేయడం తనకు చాలా గర్వకారణమంటూ సంతోషాన్ని ప్రకటించారు బల్బీర్ సింగ్ . -
విజేత జట్టుకు రూ. 39 కోట్ల 42 లక్షలు
దుబాయ్: మహిళల క్రికెట్‌కు మరింత ఊతమిచ్చే నిర్ణయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీసుకుంది. ఈనెల 30 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు భారత్–శ్రీలంక వేదికగా జరిగే మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో విజేతతో పాటు రన్నరప్, ఇతర నగదు పురస్కారాన్ని భారీగా పెంచింది. గత టోరీ్నతో పోలిస్తే మొత్తం ప్రైజ్‌మనీ దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. 2025 వన్డే వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచే జట్టుకు 48 లక్షల 80 వేల డాలర్లు (రూ. 39 కోట్ల 42 లక్షలు) లభిస్తాయి. 2022 వరల్డ్ కప్‌తో పోలిస్తే ఇది 239 శాతం ఎక్కువ కావడం విశేషం. ఫైనల్లో ఓడిన జట్టుకు 22 లక్షల 40 వేల డాలర్లు (రూ. 19 కోట్ల 70 లక్షలు) అందుకుంటుంది. సెమీఫైనల్లో ఓడిన రెండు జట్లకు 11 లక్షల 20 వేల డాలర్ల (రూ. 9 కోట్ల 85 లక్షలు) చొప్పున లభిస్తాయి. గ్రూప్ దశలో ప్రతి విజయానికి ఒక్కో జట్టు 34,314 డాలర్ల (రూ. 30 లక్షల 18 వేలు) చొప్పున అందుకుంటుంది. 5వ, 6వ స్థానాల్లో నిలిచిన రెండు జట్లకు 7 లక్షల డాలర్ల (రూ. 6 కోట్ల 15 లక్షలు) చొప్పున... 7వ, 8వ స్థానాల్లో నిలిచిన రెండు జట్లకు 2 లక్షల 80 వేల డాలర్ల (రూ. 2 కోట్ల 46 లక్షలు) చొప్పున ఇస్తారు. మొత్తంగా ఈ టోర్నీ కోసం 1 కోటీ 38 లక్షల 80 వేల డాలర్లు (రూ. 122 కోట్ల 10 లక్షలు) ప్రైజ్‌మనీగా కేటాయించారు. గత టోర్నీ ప్రైజ్‌మనీ 35 లక్షల డాలర్లతో పోలిస్తే ఏకంగా 297 శాతం పెరగడం పెద్ద విశేషం. రెండేళ్ల క్రితం భారత్‌లో జరిగిన పురుషుల వన్డే వరల్డ్ కప్‌లో కూడా ఇంతకంటే తక్కువ ప్రైజ్‌మనీనే (సుమారు రూ.88.26 కోట్లు) ఉంది. ‘మహిళల క్రికెట్‌ను మరింతగా అభివృద్ధి చేయడంతో పాటు పురుషులతో సమానంగా గుర్తింపు ఇవ్వడమే ఐసీసీ లక్ష్యం. దానికి అనుగుణంగానే ఈ భారీ ప్రైజ్‌మనీ పెంపుదలను నిర్ణయించాం. ఈ పెరుగుదల మహిళల క్రికెట్ చరిత్రలో కొత్త మలుపుగా నిలిచిపోతుంది’ అని ఐసీసీ చైర్మన్ జై షా ప్రకటించారు. -
సినిమాలు చూడండి.. రూ. 1.6 లక్షలు అందుకోండి!
సినిమాలు చూడండి.. 2000 డాలర్లు (రూ. 1.6 లక్షలు) అందుకోండి.. అంటోంది ఓ అమెరికన్ కంపెనీ. మీరు చేయాల్సిందల్లా వాళ్లు చెప్పిన సినిమాలు చూసి మీ అభిప్రాయాలను తెలియజేయడమే. యూఎస్‌కు చెందిన బ్లూమ్‌సీబాక్స్ (BloomsyBox) అనే సంస్థ వివిధ సంవత్సరాల్లో విడుదలైన పేరొందిన 12 క్రిస్మస్ సినిమాలను చూసి అభిప్రాయాలు పంచుకోవాలని సినీ ఔత్సాహికులను కోరుతోంది. ఎంపికైనవారు వాళ్లు చెప్పిన క్రిస్మస్ సినిమాలను చూసి ప్రతి సినిమా గురించి వారి అభిప్రాయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవాల్సి ఉంటుంది. ఎంపికైనవారికి డబ్బుతో పాటు హాట్ కోకా, రెండు జతల యూజీజీ సాక్స్‌లు, పీకాక్‌కి ఒక సంవత్సరం సబ్స్క్రిప్షన్, 12 నెలల ఫ్లవర్ సబ్‌స్క్రిప్షన్‌ను కంపెనీ అందజేస్తుంది చూడాల్సిన 12 సినిమాలు ఇవే.. ది మోస్ట్ వండర్ఫుల్ టైమ్ ఆఫ్ ది ఇయర్ (2008) క్రౌన్ ఫర్ క్రిస్మస్ (2015) ది నైన్ లైవ్స్ ఆఫ్ క్రిస్మస్ (2014) క్రిస్మస్ గెటవే (2017) జర్నీ బ్యాక్ టు క్రిస్మస్ (2016) గోస్ట్స్ ఆఫ్ క్రిస్మస్ ఆల్వేస్ (2022) ఫ్యామిలీ ఫర్ క్రిస్మస్ (2015) క్రిస్మస్ అండర్ రాప్స్ (2014) త్రీ వైస్ మెన్ అండ్ ఏ బేబీ (2022) ఎ రాయల్ క్రిస్మస్ (2014) నార్త్‌పోల్ (2014) ది క్రిస్మస్ ట్రైన్ (2017) -
పంజాబ్ ఆటగాళ్లకు భారీ నజరానా
సాక్షి, న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో విజయ దుందుభి మోగించిన టీమిండియా హాకీ జట్టులో తమ ఆటగాళ్లకు పంజాబ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. జర్మనీతో జరిగిన పురుషుల హాకీ మ్యాచ్‌లో విజయంతో కాంస్య పతకం సాధించిన జట్టులో రాష్ట్రానికి చెందిన హాకీ జట్టు ఆటగాళ్లకు కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ఇవ్వనున్నట్టు సర్కార్ వెల్లడించింది. పంజాబ్ క్రీడా మంత్రి రాణా గుర్మిత్ సింగ్ సోధి ఈ ప్రకటన చేశారు. ఇండియన్ హాకికి ఇదొక చారిత్రాత్మక రోజని ఆయన ట్వీట్ చేశారు. మరింత ఉన్నతమైన గోల్డ్ మెడల్‌తో తిరిగి రావాలని ఎదురుచూస్తున్నామన్నారు. మరోవైపు భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, కోచ్ గ్రాహం రీడ్, సహాయక కోచ్ పియూష్ దుబేలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీఫోన్‌లో సంభాషించారు. ఈ సందర్బంగా జట్టులోని సభ్యులందరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు మోదీ. కాగా టోక్యో ఒలింపక్స్ జర్మనీతో గురువారం జరిగిన మ్యాచ్ భారత్ టీం 5-4 తేడాతో విజయం సాదించింది. తద్వారా కాంస్య పతకాన్ని ఖాయం చేసుకోవడంతోపాటు, 41 ఏళ్ల తరువాత తొలిసారి ఒలింపిక్ పతకాన్ని సాధించిన ఘనతను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. On this historic day for #IndianHockey I am delighted to announce a cash award of Rs 1crore each to players 4m #Punjab We await ur return to celebrate the much deserving medal in #Olympics #Cheer4India #Tokyo2020 #IndvsGer #Hockey #IndianHockeyTeam@capt_amarinder @Media_SAI https://t.co/VJ8eiMu1up — Rana Gurmit S Sodhi (@iranasodhi) August 5, 2021 #WATCH | PM Narendra Modi speaks to the India Hockey team Captain Manpreet Singh, coach Graham Reid and assistant coach Piyush Dubey after the team won #Bronze medal in men's hockey match against Germany#TokyoOlympics pic.twitter.com/NguuwSISsV — ANI (@ANI) August 5, 2021 -
బీసీసీఐ నజరానాపై ద్రవిడ్ అసహనం
సాక్షి, ముంబై : అండర్-19 ప్రపంచకప్ గెలవడంతో భారత జట్టులోని ఆటగాళ్లతో పాటు కోచ్ ద్రవిడ్, సహాయక సిబ్బందికి బీసీసీఐ నజరానా ప్రకటించింది. ఈ నజరానాపై కోచ్ రాహుల్ ద్రవిడ్ అసహనం వ్యక్తం చేశాడు. గత శనివారం బీసీసీఐ జట్టులోని ఒక్కో ఆటగాడికి రూ.30 లక్షలు, కోచ్ ద్రవిడ్‌కు రూ.50లక్షలు, ఒక్కో సహాయక సిబ్బందికి రూ. 20 లక్షలు ప్రోత్సాహకంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తనకు రూ.50 లక్షలు ప్రకటించి ఇతర సహాయక సిబ్బందికి రూ.20 లక్షలు ప్రకటించడంపై ద్రవిడ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అందరూ సమిష్టిగా కృషి చేస్తేనే విజయం వరించందని, అలాంటప్పుడు నజరానా విషయంలో బీసీసీఐ వ్యత్యాసం ఎందుకు చూపించిందో అర్ధం కావడం లేదన్నాడు. తానేమి వారికంటే ఎక్కువ కష్టపడలేదని అందరికి సమాన స్థాయిలో నజరానా ప్రకటిస్తే బాగుండేదని ద్రవిడ్ అభిప్రాయపడ్డారు. మరి ద్రవిడ్ వ్యాఖ్యలను బీసీసీఐ పరిగణలోకి తీసుకుంటుందో లేదో చూడాలి. -
264 పరుగులకు రూ. 2.64 లక్షల నజరానా
కోల్ కతా: వన్డేల్లో సరికొత్త రికార్డు సృష్టించిన టీమిండియా బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ నజరానా అందజేసింది. వన్డేల్లో అత్యధికంగా 264 పరుగులు చేసినందుకు అతడికి రూ. 2.64 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. ఈడెన్ గార్డన్స్ లో మ్యాచ్ ముగిసిన తర్వాత అతడికి ఈ నజరానా అందజేసింది. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ(264) సాధించాడు. ఈ మ్యాచ్ లో భారత్ 153 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది రెండో ద్విశతకం.


