బీసీసీఐ నజరానాపై ద్రవిడ్‌ అసహనం

Rahul Dravid Voices Concern Over Disparity In Prize Money - Sakshi

తానొక్కడికి రూ.50 లక్షలివ్వడంపై ద్రవిడ్‌ అసంతృప్తి

తనతో సహా సహాయక సిబ్బందికి సమానంగా ఇవ్వాల్సింది

సాక్షి, ముంబై : అండర్‌-19 ప్రపంచకప్‌ గెలవడంతో భారత జట్టులోని ఆటగాళ్లతో పాటు కోచ్‌ ద్రవిడ్‌, సహాయక సిబ్బందికి బీసీసీఐ నజరానా ప్రకటించింది. ఈ నజరానాపై కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అసహనం వ్యక్తం చేశాడు. గత శనివారం బీసీసీఐ జట్టులోని ఒక్కో ఆటగాడికి రూ.30 లక్షలు, కోచ్‌ ద్రవిడ్‌కు రూ.50లక్షలు, ఒక్కో సహాయక సిబ్బందికి రూ. 20 లక్షలు ప్రోత్సాహకంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

తనకు రూ.50 లక్షలు ప్రకటించి ఇతర సహాయక సిబ్బందికి రూ.20 లక్షలు ప్రకటించడంపై ద్రవిడ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అందరూ సమిష్టిగా కృషి చేస్తేనే విజయం వరించందని, అలాంటప్పుడు నజరానా విషయంలో బీసీసీఐ వ్యత్యాసం ఎందుకు చూపించిందో అర్ధం కావడం లేదన్నాడు. తానేమి వారికంటే ఎక్కువ కష్టపడలేదని అందరికి సమాన స్థాయిలో నజరానా ప్రకటిస్తే బాగుండేదని ద్రవిడ్‌ అభిప్రాయపడ్డారు. మరి ద్రవిడ్‌ వ్యాఖ్యలను బీసీసీఐ పరిగణలోకి తీసుకుంటుందో లేదో చూడాలి. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top