ప్రస్తుతం మార్కెట్లో ఐఫోన్ 17 సిరీస్ మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని ఈ-కామర్స్ రిటైలర్లు ఐఫోన్ 16పై ఆఫర్స్ & డిస్కౌంట్స్ అందించడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే.. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2025 సందర్భంగా ఈ మొబైల్ కొనుగోలుపై రూ. 13,000 తగ్గింపులను ప్రకటించింది.
128జీబీ ఐఫోన్16 అసలు ధర రూ. 69900 (ఫ్లిప్‌కార్ట్). ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా.. దీనిని రూ. 13000 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ డిస్కౌంట్‌లో అనేక ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో పాటు అన్ని బ్యాంక్ ఆధారిత ఆఫర్‌లు ఉంటాయి. HDFC, SBI కార్డ్ హోల్డర్లు రూ. 5,000 వరకు తక్షణ 10% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 25000 వరకు తగ్గింపు (ఈ ధర మీరు ఎక్స్ఛేంజ్ చేసే ఫోన్ స్థితిని బట్టి ఉంటుంది) లభిస్తుంది. నో-కాస్ట్ ఈఎంఐలో భాగంగా.. 3-24 నెలల్లో చెల్లింపులు చేసుకోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ ఇతర ఐఫోన్ మోడళ్లపై కూడా డీల్‌లను అందిస్తోంది. 6.7 ఇంచెస్ పెద్ద స్క్రీన్ & పెద్ద బ్యాటరీ కలిగిన ఐఫోన్ 16 ప్లస్ ధర, డిస్కౌంట్ తర్వాత రూ.69,999 నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్ 15 రూ.49,999కి, ఐఫోన్ 15 ప్లస్ రూ.59,999కి, ఐఫోన్ 14 కేవలం రూ.44,499కే అందుబాటులో ఉంది.
ఐఫోన్ 16
ఐఫోన్ 16 శక్తివంతమైన A18 చిప్, 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే కలిగిన యాపిల్ ఫోన్. ఇది 48MP ఫ్యూజన్ లెన్స్‌లతో కూడిన కెమెరా సిస్టమ్ పొందుతుంది. ఐఫోన్ 16 యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు కూడా యాక్సెస్ చేయగలదు. కొంత తక్కువ ధరతో ఐఫోన్ 16 కొనడానికి ఇది సరైన సమయం.
ఇదీ చదవండి: రూ. లక్ష కంటే ఖరీదైన ఐఫోన్.. సగం ధరకే!


