సీనియర్ ఉద్యోగుల మూకుమ్మడి రాజీనామా | Apple facing biggest leadership shake up in decades whats happening | Sakshi
Sakshi News home page

సీనియర్ ఉద్యోగుల మూకుమ్మడి రాజీనామా

Dec 7 2025 6:28 PM | Updated on Dec 7 2025 6:28 PM

Apple facing biggest leadership shake up in decades whats happening

సిలికాన్ వ్యాలీలో దీర్ఘకాలిక స్థిరమైన కంపెనీగా ప్రసిద్ధి చెందిన యాపిల్ ఇంక్.లో సీనియర్‌ ఉద్యోగులు రాజీనామాలతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కంపెనీలోని సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, కీలక ఇంజినీర్ల ఆకస్మిక, సామూహిక నిష్క్రమణలు కంపెనీలో తీవ్ర అలజడి సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగంలో యాపిల్ వృద్ధిపై ఇది ప్రశ్నలు లేవనెత్తుతోంది.

గత వారంలోనే యాపిల్ తన కృత్రిమ మేధ (AI) అధిపతి జాన్ జియానాండ్రియా, ఇంటర్‌ఫేస్ డిజైన్ చీఫ్ అలాన్ డై తమ పదవి నుంచి నిష్క్రమించారు. వీరితో పాటు జనరల్ కౌన్సిల్ కేట్ ఆడమ్స్, సామాజిక కార్యక్రమాల వైస్ ప్రెసిడెంట్ లిసా జాక్సన్ కూడా 2026లో పదవీ విరమణ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నలుగురు అధికారులు నేరుగా సీఈఓ టిమ్‌కుక్‌కు రిపోర్ట్ చేసేవారు.

టిమ్‌కుక్‌ ప్రయత్నాలు..

అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం త్వరలో మరి కొంతమంది కీలక పదవుల్లో ఉన్నవారు తమ పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. యాపిల్‌లో అత్యంత గౌరవనీయమైన, ఇన్-హౌస్ చిప్స్ ప్రాజెక్ట్‌ హార్డ్‌వేర్ టెక్నాలజీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జానీ స్రూజీ సమీప భవిష్యత్తులో పదవి నుంచి నిష్క్రమించాలని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ఇటీవల కుక్‌కు తెలిపారు. కుక్, స్రూజీని నిలుపుకోవడానికి వేతన ప్యాకేజీ ఆఫర్‌ చేస్తూ ముఖ్యమైన బాధ్యతలతో సహా దూకుడుగా ప్రయత్నిస్తున్నారు.

యాపిల్‌కు సమస్య

ఎగ్జిక్యూటివ్‌ల నిష్క్రమణ ఒకవైపు ఆందోళన కలిగిస్తుండగా ఏఐ ప్రతిభ టెక్ ప్రత్యర్థుల వైపు మళ్లుతుండడం యాపిల్‌కు మరో పెద్ద సమస్యగా మారింది. మెటా ప్లాట్‌ఫామ్స్ ఇంక్., ఓపెన్‌ఏఐ, వివిధ స్టార్టప్‌లు యాపిల్ ఇంజినీర్లకు భారీ ప్యాకేజీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇది సంస్థ ఏఐ ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో యాపిల్ జనరేటివ్ ఏఐలో ముందుండేందుకు కష్టపడుతోంది.

ఇదీ చదవండి: ప్రముఖ బ్యాంక్‌లో 10,000 ఉద్యోగాల కోత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement