సాక్షి, హైదరాబాద్: కోకాపేట నియోపోలీస్ హెచ్‌ఎండీ భూముల వేలంలో మరో రికార్డు నమోదైంది. ఎకరం ధర రూ.151 కోట్లు పలికింది. గోల్డెన్ మైల్‌లోని ప్లాట్‌నెంబర్ 15, 16లో భూములకు శుక్రవారం వేలం జరిగింది. అయితే.. ప్లాట్ నెంబర్ 15లో ఎకరానికి రూ.151.25 కోట్ల ధర పలికింది.
జీహెచ్‌ఆర్ సంస్థ ఈ ధరకు భూముల్ని దక్కించుకుంది. ఈ ప్లాట్‌లో 4.03 ఎకరాలకు గాను 609 కోట్ల 55 లక్షలను హెచ్‌ఎండీ పొందింది. ఇక ప్లాట్ నెంబర్ 16లో ఎకరం ధర రూ.147.75 కోట్లు పలికింది. కోకాపేట నియోపోలిస్‌లో హెచ్ఎండీఏ వేలం వేస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 3న మిగతా ప్లాట్లకు వేలం జరగనుంది.


