సీఎం పదవికి కేసీఆర్‌ రాజీనామా | Sakshi
Sakshi News home page

ఓఎస్డీ ద్వారా గవర్నర్‌కు రాజీనామా లేఖ

Published Sun, Dec 3 2023 4:52 PM

Kcr Resigns To Telangana Cm Post - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ సీఎం పదవికి కేసీఆర్‌ రాజీనామా చేశారు. ఆదివారం విడుదలైన ఎన్నికల ఫలితాల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి ఖాయమవడంతో తన ఓఎస్డీ ద్వారా గవర్నర్‌ తమిళిసైకి తన రాజీనామా లేఖను పంపించారు.

సాధారణంగా పార్టీ ఓటమి పాలైన తర్వాత ముఖ్యమంత్రులు  రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు నేరుగా రాజీనామా లేఖను సమర్పిస్తారు. దీనికి భిన్నంగా కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు వెళ్లకుండానే సీఎం పదవికి రాజీనమా చేయడం గమనార్హం.  ఈ  ఎన్నికల్లో కాంగ్రెస్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ దాటి  తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

కేసీఆర్‌ రాజీనామా చేసే కంటే ముందే బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్విట్టర్‌లో పార్టీ ఓటమిని అంగీకరించారు. గెలిచిన కాంగ్రెస్‌ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. తమతప్పు సరిదిద్దుకుంటామని తెలిపారు.  

Advertisement
 

తప్పక చదవండి

Advertisement