గవర్నర్‌ను కలిసిన హీరో నాగార్జున | Nagarjuna Met With Mizoram Governor Kambhampati Haribabu In Vizag, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Nagarjuna: గవర్నర్‌ను కలిసిన హీరో నాగార్జున

Oct 3 2024 1:24 PM | Updated on Oct 3 2024 1:40 PM

Nagarjuna met With Mizoram Governor Haribabu in Vizag

టాలీవుడ్ హీరో నాగార్జున ప్రస్తుతం వైజాగ్‌లో ఉన్నారు. అనారోగ్యంతో ఉన్న మిజోరం గవర్నర్‌ కంభంపాటి హరిబాబును ఆయన పరామర్శించారు. ఇటీవల ఆయన అస్వస్థకు గురయ్యారు. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న హరిబాబును కలిసి యోగ, క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం నాగార్జున ఓ మూవీ షూటింగ్‌ కోసం విశాఖ వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే మీడియాతో మాట్లాడేందుకు నాగార్జున నిరాకరించారు.

(ఇది చదవండి: మీ హెడ్‌లైన్స్‌ కోసం మా జీవితాలే దొరికాయా?: నాగచైతన్య)

కాగా.. ఇప్పటికే నాగార్జున కుటుంబాన్ని ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్‌ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. సమంత- నాగచైతన్య విడాకులను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఈ విషయంపై టాలీవుడ్ సినీ ప్రముఖులంతా మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. ఇలాంటి వాటిని ఊపేక్షించేది లేదని చిరంజీవి, మంచువిష్ణు, జూనియర్ ఎన్టీఆర్, వెంకటేశ్, అల్లు అర్జున్‌, నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇప్పటికే సమంతకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు కూడా చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement