
సాక్షి, చెన్నై: గవర్నర్ ఆర్‌ఎన్ రవికి వ్యతిరేకంగా తమిళనాడు(Tamil Nadu) ప్రభుత్వం సుప్రీంకోర్టులో మళ్లీ పిటిషన్ దాఖలు చేసింది. అందులో కలైంజ్ఞర్ కరుణానిధి పేరిట వర్సిటీ ఏర్పాటుకు అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్(RN Ravi) ఎడతెగని జాప్యం చేస్తూ చివరకు రాష్ట్రపతికి పంపించినట్లు ఆరోపించింది.
వివరాలు ఇలా ఉన్నాయి.. రాష్ట్ర గవర్నర్, డీఎంకే ప్రభుత్వం(MK Stalin) మధ్య వివిధ అంశాలపై నెలకొన్న వివాదాలు ఇప్పటికే సుప్రీంకోర్టు(Supreme Court) వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ‘సుప్రీం’ ఉత్తర్వులతో రాష్ట్ర ప్రభుత్వం పలు వర్సిటీల వ్యవహారాలకు సంబంధించిన ముసాయిదాలను ఆమోదించుకుంది. ఈ పరిస్థితుల్లో కుంభకోణంలో కలైంజ్ఞర్ కరుణానిధి పేరిట వర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌లో నిర్ణయించింది.
అసెంబ్లీ ఆమోదం పొందిన ఈ ముసాయిదా రాజ్‌భవన్‌కు చేరింది. ఆరు నెలలు అవుతున్నా ఇంతవరకు రాజ్‌భవన్ నుంచి ఆమోదం రాలేదు. తాజాగా.. ఈ ముసాయిదాను రాష్ట్రపతికి పంపించినట్లు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో ఈ వర్సిటీ సాధన కోసం డీఎంకే ప్రభుత్వం మళ్లీ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. ఈ మేరకు గవర్నర్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో శనివారం పిటిషన్ దాఖలు చేసింది.
ఇది కూడా చదవండి: మీరేం ఒంటరి కాదు.. విజయ్‌కు దన్నుగా ఢిల్లీ పెద్దలు!