సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీ సీఈసీ సభ్యునిగా కూనదరాజు సత్యనారాయణరాజు (రాజోలు), పార్టీ అధికార ప్రతినిధిగా జి.వీరశేఖరరెడ్డి (ఉదయగిరి) నియమితులయ్యారు.
కాగా, ఇటీవల తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా వడ్డీ రఘురామ్ నియమితులైన సంగతి తెలిసిందే. ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా సాది శ్యాం ప్రసాద్ రెడ్డి, సీఈసీ (CEC) సభ్యుడిగా పిరియా సాయిరాజ్, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం కోఆర్డినేటర్‌గా తమ్మినేని సీతారాం నియమితులయ్యారు.


