
చెన్నై: యూనివర్సిటీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన స్నాతకోత్సవంలో తమిళనాడు గవర్నర్ రవీంద్ర నారాయణ రవిని (ఆర్.ఎన్.రవి) ఓ విద్యార్ధిని అవమానించింది. డాక్టరేట్‌ను గవర్నర్ చేతులు మీదిగా తీసుకునేందుకు తిరస్కరించింది. గవర్నర్ ఆర్.ఎన్ రవి పిలుస్తున్నా.. పట్టించుకోకుండా వెళ్లిపోయింది. దీంతో తమిళనాడు ప్రభుత్వానికి..ఆ రాష్ట్ర గవర్నర్‌ల మధ్య అంతర్గత విభేదాలు మరోసారి బహిరంగంగా బయటపడ్డాయి.
మనోన్మణియం సుందరనార్ యూనివర్సిటీలో 32వ కాన్వికేషన్ వేడుక జరిగింది. ఈ వేడుకలో విద్యార్ధిని, అధికార డీఎంకే నేత రాజన్ సతీమణి జీన్‌జోసెఫ్ తన డిగ్రీని అందుకునేందుకు వేదికపైకి వచ్చారు. వాస్తవానికి డిగ్రీ పట్టాను గవర్నర్ తన చేతులకు మీదిగా విద్యార్ధులకు అందించడం ఆనవాయితి. కానీ మనోన్మణియం సుందరనార్ కాన్వకేషన్ వేడుకల్లో విద్యార్థులు గవర్నర్ చేత డిగ్రీలు తీసుకుంటుండగా..జీన్ జోసెఫ్ గవర్నర్ ఆర్.ఎన్ రవిని కాదని పక్కన ఉన్న వైస్ చాన్సలర్ చంద్రశేఖర్ చేతులు మీదిగా తీసుకున్నారు. గవర్నర్ ఆమెను పిలిచినా పట్టించుకోలేదు. వైస్ ఛాన్సలర్ చంద్రశేఖర్ చేతులు మీదిగా పట్టాను అందుకున్నారు.
గవర్నర్ ఆర్.ఎన్.రవి ఏం చేశారని..
మైక్రో ఫైనాన్స్‌లో డాక్టరేట్ పొందిన జీన్ జోసెఫ్ గవర్నర్‌కు బదులుగా యూనివర్శిటీ వైస్ చాన్సలర్ నుండి డాక్టరేట్‌ను తీసుకోవడం స్థానిక మీడియా ఆమెను ప్రశ్నించింది. ‘గవర్నర్ ఆర్.ఎన్.రవి తమిళనాడు రాష్ట్రానికి, ప్రజలకు వ్యతిరేకం. ఆయన తమిళ ప్రజల కోసం ఏమీ చేయలేదు. అందుకే ఆయన చేతి నుండి డాక్టరేట్‌ను స్వీకరించాలనుకోలేదు’ అని జీన్ జోసెఫ్ పేర్కొన్నారు.
தமிழுக்கும், தமிழ்நாட்டுக்கும் எதிராக செயல்படுவதால் ஆளுநர் கையில் பட்டத்தை வாங்காமல் தவிர்த்த மனோன்மணியம் சுந்தரனார் பல்கலைக்கழக மாணவி ஜீன் ஜோசப் அவர்கள்.
ஆளுநரை தமிழ்நாட்டு மக்கள் எவ்வாறு புரிந்து கொண்டுள்ளார்கள் என்பது ரவி அவர்களுக்கு தெரிந்து இருக்கும், சங்கிகளுக்கு… pic.twitter.com/zIB8e8or5D— DMK Updates (@DMK_Updates) August 13, 2025
తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ ఆర్.ఎన్ రవి
నవంబర్ 2020 నుండి ఏప్రిల్ 2023 వరకు తమిళనాడు అసెంబ్లీ 13 బిల్లులను ఆమోదించింది. వాటిలో 10 బిల్లులను గవర్నర్ తిరస్కరించారు. కొన్నింటి తిరిగి పంపించారు. అసెంబ్లీ మళ్లీ ఆ బిల్లులను మార్పులు లేకుండా ఆమోదించినా, గవర్నర్ వాటిని రాష్ట్రపతి పరిశీలనకు పంపించారు. దీంతో గవర్నర్ తీరును తప్పుబడుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన కోర్టు గవర్నర్ తీరును ప్రశ్నించింది. ప్రభుత్వం పంపిన బిల్లులకు ఆమోదం తెలపాలని ఆదేశాలు జారీ చేసింది. నాటి నుంచి తమిళనాడు ప్రభుత్వానికి.. గవర్నర్ ఆర్.ఎన్ రవి విభేదాలు కొనసాగుతున్నాయి. తాజా స్నాతకోత్సవ ఘటనతో మరోసారి భయటపడింది