స్టాలిన్‌కు గుణపాఠం తప్పదు.. దద్దరిల్లిన విజయ్‌ సభ | Assembly polls will give DMK a fitting lesson TVK chief Vijay | Sakshi
Sakshi News home page

స్టాలిన్‌కు గుణపాఠం తప్పదు.. దద్దరిల్లిన విజయ్‌ సభ

Dec 9 2025 1:24 PM | Updated on Dec 9 2025 3:42 PM

Assembly polls will give DMK a fitting lesson TVK chief Vijay

పుదుచ్చేరి: తమిళగ వెట్రి కళగం (టీవీకే) చీఫ్ విజయ్.. డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాబోయే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు డీఎంకేకి తగిన గుణపాఠం చెబుతాయని హెచ్చరించారు. గతంలో కరూర్‌లో విజయ్‌ బహిరంగ సభ జరగగా,  తొక్కిసలాట జరిగి  41 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నేడు (మంగళవారం) పుదుచ్చేరిలో జరిగిన ర్యాలీలో విజయ్ మాట్లాడుతూ.. ‘2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నుండి డీఎంకే పాలకులు 100 శాతం గుణంపాఠం నేర్చుకుంటారు. మా ప్రజలు దానిని నిర్ధారిస్తారు’ అని అన్నారు. పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ విజయ్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.

డీఎంకే ప్రభుత్వంపై విజయ్‌ విమర్శలు కొనసాగిస్తూ.. పుదుచ్చేరి సీఎం రంగసామి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ప్రశంసించారు. పుదుచ్చేరి ప్రభుత్వం నిష్పాక్షికంగా వ్యవహరిస్తోందని, ప్రత్యర్థి పార్టీ ర్యాలీకి సైతం భద్రత కల్పించిందని ఆయన పేర్కొన్నారు. ‘సీఎం రంగసామి నేతృత్వంలోని పుదుచ్చేరి ప్రభుత్వం తమిళనాడు డీఎంకే పాలన లాంటిది కాదు’ అని వ్యాఖ్యానించారు. తమిళనాడు డీఎంకే పాలకులు పుదుచ్చేరి ప్రభుత్వం నుండి నేర్చుకుంటే మంచిది, అయితే, వారు ఇప్పుడు నేర్చుకోరు' అని వ్యంగ్యంగా అన్నారు. పుదుచ్చేరికి మద్దతు ఇవ్వడం తన కర్తవ్యమని టీవీకే చీఫ్ ప్రకటించారు.

Puducherry: కరూర్ తొక్కిసలాట తర్వాత తొలి ర్యాలీలో పాల్గొన్న విజయ్
 

ఈ సందర్భంగా విజయ్.. పుదుచ్చేరికి రాష్ట్ర హోదాపై ఉన్న డిమాండ్‌ను మరోమారు లేవనెత్తారు. కేంద్రం  అభివృద్ధి  విషయంలో పుదుచ్చేరికి మద్దతు ఇవ్వలేదనిఅని విమర్శించారు. అయితే, కేంద్రం విభజించి చూసినా..  తమిళనాడు, పుదుచ్చేరి ప్రజలు కలిసి ఉన్నారని ఆయన పేర్కొన్నారు.  గత సెప్టెంబర్ 27న కరూర్‌లో టీవీకే నేత విజయ్ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించగా, 110 మంది గాయపడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement