అశేష సినీ అభిమానుల అండతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత అగ్రనటుడు విజయ్.. ఆ తర్వాత అనూహ్య పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా కరూర్ ఘటన తర్వాత ఆయన విపరీతమైన గందరగోళంలోకి కూరుకుపోయాడు. ఒక దశలో రజినీకాంత్‌లాగా వెనకడుగు వేస్తారని.. కమల్ హాసన్‌లాగా పొత్తువైపునకు వెళ్తారని చర్చా జరిగింది. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన తొలిసారి తన మనోగతాన్ని పంచుకున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల రూపంలో తొలి పరీక్షకు సిద్ధమవుతున్న అగ్రనటుడు, తమిళగ వెట్రి కగళం అధినేత విజయ్ తన రాజకీయ ప్రయాణంపై ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఉన్న ఫ్యాన్‌ఫాలోయింగ్‌నే పార్టీ వైపు మళ్లించుకుని.. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు సందేశం ఇచ్చారు.
కరూర్ ఘటన.. సీబీఐ దర్యాప్తు ఇబ్బంది పెట్టాయా?
కరూర్‌లో జరిగిన తొక్కిసలాట తీవ్రంగా కలచివేసింది. అలాంటి సంఘటన ఒకటి జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. అందుకే ఆ ఘోరం ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది.
మళ్లీ సినిమాలు చేస్తారా?..
దశాబ్దాలపాటు సినీ రంగంలో కొనసాగా. హఠాత్తుగా తీసుకున్న నిర్ణయమేమీ కాదు. ఒక స్పష్టమైన లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చా. ఇదే ఇక నా భవిష్యత్తు
తాజాగా సినిమాకు ఎదురైన సెన్సార్ ఇబ్బందులు..
‘జన నాయగన్’ చిత్రం విడుదలకు అనుమతి రాకపోవడం నిర్మాతకు తీవ్ర నష్టం కలిగించింది. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి అడ్డంకులు ఎదురవుతాయని ముందే ఊహించా
ఈ ఎన్నికల్లో ఫలితంపై రాజకీయ భవిష్యత్తు ఉండబోతుందా?
నేను ఈ ఒక్క ఎన్నిక కోసం పార్టీ పెట్టలేదు. దీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగాలనుకుంటున్నా
అమితంగా ప్రేరణ కలిగించిన వ్యక్తులు..
షారుక్ ఖాన్ నాకు అభిమాన నటుడు. రాజకీయాల్లో ఎంజీఆర్, జయలలితను ఆదర్శంగా తీసుకున్నా
తమిళనాడు రాజకీయాల్లో కింగ్‌మేకర్ అవుతారని అనుకుంటున్నారా?
నా ర్యాలీలకు వచ్చే జనాలను చూస్తున్నారా?. నేను గెలుస్తాను. అంతేగానీ కింగ్‌మేకర్ అవ్వాల్సిన అవసరం ఏంటి?
ఎన్నికల చిహ్నంపై రియాక్షన్
మొదటి విజయం.. దైవ సంకేతం. టీవీకే పార్టీకి ఎన్నికల కమిషన్ ‘విజిల్’ గుర్తు కేటాయించడం చాలా సంతోషాన్నిచ్చింది

Source: NDTV


