సాక్షి, తాడేపల్లి: గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఆయనకు కర్నాటక లా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించటంపై హర్షం వ్యక్తం చేశారు. న్యాయమూర్తిగా ఎన్నో కీలక తీర్పులు ఇచ్చిన అబ్దుల్ నజీర్.. నేడు గవర్నర్‌గా కూడా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో ముందున్నారని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
‘‘చట్టం, న్యాయ పరిరక్షణకు విశేష కృషి చేసిన ఆయనకు కర్ణాటక స్టేట్ లా యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించడం రాష్ట్రానికి గర్వకారణం. ఇది వారి అంకితభావానికి లభించిన గుర్తింపు. ఈ సందర్భంగా గవర్నర్ నజీర్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను’’ అని ఎక్స్‌లో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.
న్యాయమూర్తిగా ఎన్నో కీలక తీర్పులు ఇచ్చిన అబ్దుల్ నజీర్ గారు, నేడు గవర్నర్‌గా కూడా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో ముందున్నారు. చట్టం, న్యాయ పరిరక్షణకు విశేష కృషి చేసిన ఆయనకు కర్ణాటక స్టేట్ లా యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ (Honorary Doctor of Laws) ప్రకటించడం రాష్ట్రానికి… pic.twitter.com/BDwSNSHr50
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 5, 2025


