
సాక్షి, తాడేపల్లి: పులివెందులలో టీడీపీ అరాచకాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది. జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై టీడీపీ గుండాలు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.
ఈ విషయమై.. గురువారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలవనున్నారు. సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నేతృత్వంలోని బృందం ఆయన్ని కలిసి జరిగిన పరిణామాలను వివరించనుంది. అదే సమయంలో దాడికి పాల్పడిన వారి మీద చర్యలు తీసుకోకుండా ఏకపక్షంగా బాధితులమీద కేసులు నమోదు అవుతున్న విషయం పైనా ఫిర్యాదు చేయనుంది. పులివెందులలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టాలని బొత్స బృందం గవర్నర్‌ను కోరనున్నట్లు సమాచారం.