సాక్షి, కృష్ణా జిల్లా: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనపై చంద్రబాబు సర్కార్ అడుగడుగునా ఆంక్షలు పెడుతోంది. వైఎస్ జగన్‌ను కలవకుండా రైతులపై ఆంక్షలు విధిస్తోంది. జనాన్ని రాకుండా అడ్డుకోవడానికి వందల మంది పోలీసులు మోహరించారు. వైఎస్ జగన్ పర్యటించే గ్రామాలను పోలీసులు బ్లాక్ చేశారు.
నేడు కృష్ణా జిల్లాలో మోంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి.. రైతులతో ఆయన మాట్లాడనున్నారు. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్.ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలంటూ పోలీసులు షరతులు విధించారు.
కేవలం 500 మంది, 10 వాహనాలకు మాత్రమే అనుమతి అంటూ ఆంక్షలు పెట్టారు. ద్విచక్ర వాహనాలకు ఎలాంటి అనుమతి లేదంటూ ఆంక్షలు విధించిన పోలీసులు.. వైఎస్ జగన్ పర్యటనకు రావొద్దంటూ వైఎస్సార్‌సీపీ నాయకులకు నోటీసులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, మండల, గ్రామ నాయకులకు నోటీసులతో పోలీసులు బెదిరింపు చర్యలకు దిగారు.


