సాక్షి,అమరావతి: గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 రోజులు ఇవ్వాల్సిన రేషన్ రెండు రోజులే ఇస్తున్నారు. వృద్ధులకు ఇంటికెళ్లి ఇవ్వాలి కానీ ఆ పరిస్థితి లేదు. రేషన్ తరలిపోతుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై మంత్రి దృష్టి పెట్టాలి’అని డిమాండ్ చేశారు.