Raj Bhavan: నేను మీకు చెప్పను గవర్నర్‌కే చెబుతా.. | Woman Protest In Front Of Raj Bhavan To Meet Governor, More Details Inside | Sakshi
Sakshi News home page

Raj Bhavan: నేను మీకు చెప్పను గవర్నర్‌కే చెబుతా..

Jun 21 2025 7:55 AM | Updated on Jun 21 2025 10:42 AM

Woman Protest In Front Of Raj Bhavan

పంజగుట్ట: గవర్నర్‌ను కలవాలంటూ రాజ్‌భవన్‌ ముందు ఒక మహిళ బైఠాయించింది. గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుంటే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాను అంటూ రాజ్‌భవన్‌ గేటు ముందు బైఠాయించడంతో పోలీసులు ఆమెను పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే..

రిసాలబజార్‌కు చెందిన నాగమణి శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్‌ వద్దకు వచ్చి గేటు ముందు బైఠాయించింది. అక్కడున్న సెక్యురిటీ సిబ్బంది ఏం కావాలి అని అడిగితే బోరున ఏడుస్తూ తాను గవర్నర్‌ను కలవాలి అని చెప్పింది. సమస్య ఏమిటో చెప్పు అంటే నేను మీకు చెప్పను గవర్నర్‌కే చెబుతాను అంటూ అక్కడే బైఠాయించింది. దీంతో పోలీసులు వచ్చి ఆమెను స్టేషన్‌కు తరలించారు. 

ముంబైలో తన ఇంట్లో రూ.24 లక్షల చోరీ జరిగిందని, ఇదే విషయమై బొల్లారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోవడంలేదని, ముఖ్యమంత్రి ఇంటికి వారం రోజులు తిరిగాను, పోలీస్‌ ఉన్నతాధికారుల వద్దకు వెళ్లాను అయినా ఏం ఫలితం లేదంటూ ఏదేదో చెబుతుందని పోలీసులు తెలిపారు. నాగమణి మానసికంగా తీవ్ర ఒత్తిడిలో ఉండి..పొంతన లేకుండా మాట్లాడుతుందని పోలీసులు తెలిపారు.   

Advertisement
 
Advertisement
Advertisement