breaking news
bollaram police station
-
Raj Bhavan: నేను మీకు చెప్పను గవర్నర్‌కే చెబుతా..
పంజగుట్ట: గవర్నర్‌ను కలవాలంటూ రాజ్‌భవన్ ముందు ఒక మహిళ బైఠాయించింది. గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వకుంటే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాను అంటూ రాజ్‌భవన్ గేటు ముందు బైఠాయించడంతో పోలీసులు ఆమెను పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే..రిసాలబజార్‌కు చెందిన నాగమణి శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్ వద్దకు వచ్చి గేటు ముందు బైఠాయించింది. అక్కడున్న సెక్యురిటీ సిబ్బంది ఏం కావాలి అని అడిగితే బోరున ఏడుస్తూ తాను గవర్నర్‌ను కలవాలి అని చెప్పింది. సమస్య ఏమిటో చెప్పు అంటే నేను మీకు చెప్పను గవర్నర్‌కే చెబుతాను అంటూ అక్కడే బైఠాయించింది. దీంతో పోలీసులు వచ్చి ఆమెను స్టేషన్‌కు తరలించారు. ముంబైలో తన ఇంట్లో రూ.24 లక్షల చోరీ జరిగిందని, ఇదే విషయమై బొల్లారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోవడంలేదని, ముఖ్యమంత్రి ఇంటికి వారం రోజులు తిరిగాను, పోలీస్ ఉన్నతాధికారుల వద్దకు వెళ్లాను అయినా ఏం ఫలితం లేదంటూ ఏదేదో చెబుతుందని పోలీసులు తెలిపారు. నాగమణి మానసికంగా తీవ్ర ఒత్తిడిలో ఉండి..పొంతన లేకుండా మాట్లాడుతుందని పోలీసులు తెలిపారు. -
ఏసీబీ వలలో బొల్లారం ఎస్ఐ, కానిస్టేబుల్
సాక్షి, హైదరాబాద్ : ఓ కేసు విషయమై రూ.20 వేల లంచాన్ని ఫోన్ పే ద్వారా తీసుకున్న బొల్లారం ఎస్ఐ బ్రహ్మచారి, కానిస్టేబుల్ నగేష్‌లను సోమవారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ హైదరాబాద్ రేంజ్2 డీఎస్పీ ఎస్.అచ్చేశ్వర్ రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బొల్లారం ఆదర్శనగర్‌కు చెందిన జనగాం నర్సింగ్‌రావు బ్యాండ్‌మేళా నిర్వహిస్తుంటాడు. నర్సింగ్‌రావు వద్ద పనిచేసే వర్గల్‌కు చెందిన గోపీ అడ్వాన్స్‌గా రూ.18వేలు తీసుకుని ఏడాదిగా పనిలోకి రావడం లేదు. అకస్మాత్తుగా ఈ నెల 2వ తేదీన రోడ్డుపై కలవడంతో పనికి ఎందుకు రావడం లేదని గోపీని నిలదీయగా వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే గోపీపై నర్సింగ్‌రావు చేయిచేసుకున్నాడు. దీంతో గోపీ తన యాజమాని నర్సింగ్‌రావుపై ఈ నెల 3వ తేదీన బొల్లారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు నర్సింగ్‌రావుపై సెక్షన్ 324, 384 కింద కేసు నమోదు చేశారు. పోలీసులు విచారణ నిమిత్తం పిలిచినా రాకుండా నర్సింగ్‌రావు కాలయాపన చేస్తూ వస్తున్నాడు. ముందస్తు బెయిల్‌కు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో కానిస్టేబుల్ నగేష్ ద్వారా ఎస్ఐ బ్రహ్మచారికి రాయబారం నడిపాడు. స్టేషన్ బెయిల్ ఇవ్వాలంటే రూ. 20వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడు. స్టేషన్ బెయిల్ నిమిత్తం కానిస్టేబుల్ నగేష్ ఈ నెల 13వ తేదీన నర్సింగ్‌రావు ఇంటికి రావడంతో ఆయన భార్య అంభికా మొదటి విడతగా కానిస్టేబుల్‌కు రూ.10వేల నగదును ఇచ్చింది. నర్సింగ్‌రావు ఇంటి ఎదురుగా ఉన్న టెంట్‌హౌజ్ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలన్ని రికార్డయ్యాయి. అనంతరం రెండు రోజుల తరువాత మిగతా డబ్బులు ఫోన్ పే చేయాలని కానిస్టేబుల్ నగేష్ నర్సింగ్‌రావు భార్య అంబికకు ఫోన్ చేశాడు. అకౌంట్ నంబర్ పంపివ్వాలని ఆమె సూచించగా వాట్సాప్‌లో అకౌంట్ నంబర్ పంపగా, ఆ అకౌంట్ నంబర్‌కు రూ.10వేలు బదిలీ చేసింది. అనంతరం కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి డబ్బులు బదిలీ చేసినట్లు తెలిపింది. ఈ విషయం ఎస్ఐకి చెప్పాలనగా కానిస్టేబుల్ నగేష్ కాన్ఫరెన్స్ కలిపాడు. డబ్బులు పంపించినట్లు ఆమె చెప్పిన విషయాన్ని విన్నాడు. ఈ నేపథ్యంలో స్టేషన్ బెయిల్ వస్తుందనుకున్న నర్సింగ్‌రావుకు మాత్రం నిరాశే మిగిలింది. బెయిల్ ఇవ్వాలంటే టీఆర్ఎస్ నేత వేణుగోపాల్‌రెడ్డిని వెంటబెట్టుకుని స్టేషన్‌కు రావాలని ఎస్ఐ బ్రహ్మచారి తనకు సూచించాడని నర్సింగ్‌రావు అన్నారు. ఇదిలా ఉండగా మరోసారి తన ఇంటికి వచ్చిన కానిస్టేబుల్ రూ.5వేలు కావాలని డిమాండ్ చేశాడని తెలిపాడు. డబ్బులు ఇచ్చినా స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా, కక్ష్య పూరితంగా వ్యవహరిస్తుండడంతో నగర ఏసీబీని ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సీసీ కెమెరాల రికార్డుతో పాటు ఫోన్లోని వాట్సాప్, ఆడియోలను పరిశీలించి, పూర్తి ఆదారాలతో సోమవారం బొల్లారం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఎస్ఐ బ్రహ్మచారి, కానిస్టేబుల్ నగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
బొల్లారం పోలీస్‌స్టేషన్‌కి ప్రొఫెసర్ కొదండరామ్
-
చింతల్ బజార్లో చోరీ
హైదరాబాద్ : బొల్లారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని చింతల్ బజార్లో శుక్రవారం తెల్లవారుజామున దోపిడి దొంగలు హల్చల్ చేశారు. ఓ ఇంట్లోకి దొంగలు చొరబడి 7.3 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఆ విషయాన్ని ఈ రోజు ఉదయం గమనించిన ఇంటి యజమాని పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా పోలీసులు చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. -
ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు
హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై శుక్రవారం కేసు నమోదు అయింది. పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలతో ఆయనపై బొల్లారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. బీఫ్ ఫెస్టివల్‌ను అడ్డుకుంటున్న రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చారు. అయితే అక్కడ జరిగిన వాగ్వాదంలో సీఐను ఎమ్మెల్యే దూషించడంతో కేసు నమోదైంది. కాగా గతంలో కూడా రాజాసింగ్‌పై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. విధి నిర్వహణలో ఉన్న ఆ కానిస్టేబుల్ పై దాడి చేయడమే కాక చంపేస్తానంటూ బెదిరించారు. దీంతో బాధిత కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదు చేశారు.