‘డీఎస్సీలో అక్రమాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం’ | botsa satyanarayana slams chandrababu naidu | Sakshi
Sakshi News home page

‘డీఎస్సీలో అక్రమాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం’

Jun 2 2026 6:14 PM | Updated on Jun 2 2026 7:41 PM

botsa satyanarayana slams chandrababu naidu

సాక్షి,విశాఖ: యువత భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోంది. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అయ్యిందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. విశాఖలో మంగళవారం బొత్స మీడియాతో మాట్లాడారు.

‘డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. డీఎస్సీలో అక్రమాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం. చంద్రబాబు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. వ్యవస్థను కూటమి ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోంది. డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తే సమాధానం లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పదివేల ఉద్యోగాలు భర్తీ చేశామ’ని గుర్తు చేశారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement