‘ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ భారత్‌తో రాష్ట్రాల మధ్య సాంస్కృతిక మార్పిడి’ | IIT Shillong Students Meet Telangana Governor | Sakshi
Sakshi News home page

‘ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ భారత్‌తో రాష్ట్రాల మధ్య సాంస్కృతిక మార్పిడి’

May 28 2026 11:00 PM | Updated on May 28 2026 11:00 PM

IIT Shillong Students Meet Telangana Governor

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ "ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ భారత్‌’ కార్యక్రమంతో రాష్ట్రాల మధ్య సాంస్కృతిక మార్పిడి జరుగుతుందని గతంలో ఎన్నడూ లేని విధంగా ఈశాన్య రాష్ట్రాలతో ఇతర రాష్ట్రాల కు కనెక్టివిటీ నీ కేంద్ర ప్రభుత్వం పెంచిందని తద్వారా ఈశాన్య రాష్ట్రాలు మిగతా రాష్ట్రాలకు మరింతగా సాంస్కృతికంగా చేరువయ్యాయని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు.

కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్-యువ సంగమ్ ఫేజ్-6’ కార్యక్రమంలో భాగంగా మేఘాలయ రాష్ట్రంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) షిల్లాంగ్‌కు చెందిన 50 మంది విద్యార్థులు గురువారం లోక్ భవన్‌లో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు. దేశంలోని విభిన్న రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు, జీవన విధానాల పరస్పర అవగాహన కోసం కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు.

యువత దేశ సమైక్యత, జాతీయ సమగ్రత బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, అభివృద్ధి విశేషాలను విద్యార్థులకు అధికారులు వివరించారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దాన కిషోర్, ఎన్‌ఐటీ వరంగల్‌కు చెందిన ప్రొఫెసర్ కిరణ్ కుమార్, సునీల్ కుమార్, ప్రొఫెసర్ పెరుగు శ్యామ్ (కో-నోడల్ ఆఫీసర్), ప్రొఫెసర్ హరిప్రసాద్ రెడ్డి (నోడల్ ఆఫీసర్) పాల్గొన్నారు.

గవర్నర్‌ను కలిసిన ఎన్‌ఎస్‌జీ గ్రూప్ కమాండర్‌
నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ (ఎన్‌ఎస్‌జీ), ముంబై 28 స్పెషల్‌ కాంపోజిట్‌ గ్రూప్‌ (ఎస్‌సీజీ) గ్రూప్‌ కమాండర్‌ కల్నల్‌ అభిషేక్‌ సింగ్‌ గురువారం లోక్‌ భవన్‌లో  గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లాను కలిశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement