
జైలు సిబ్బంది కవాతు, విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

రాజబహదూర్ వెంకటరామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో మంగళవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించిన 7వ ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్–2025 మూడురోజులపాటు జరగనుంది.

దేశంలోని 21 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 1222 మంది పోటీదారులు, 144 మంది సిబ్బంది పాల్గొననున్నారు. ప్రొఫెషనల్, క్రీడలు, సాహిత్యం, కళలు.. మొత్తం 36 విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు.



























