ఇంక్విలాబ్ మంచ్ నేతపై కాల్పులు..
అప్రమత్తంగా ఉండాలంటూ బలగాలకు ఆదేశాలు
ఢాకా: సాంస్కృతిక సంస్థ ఇంక్విలాబ్ మంచ్ నేత షరీఫ్ ఒస్మాన్ హాదీపై కాల్పుల ఘటన బంగ్లాదేశ్‌లో అలజడి సృష్టించింది. తీవ్రంగా గాయపడిన హాదీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా దేశవ్యాప్తంగా మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆపద్ధర్మ ప్రభుత్వా ధిపతి మహ్మద్ యూనస్ భద్రతాధికారులకు శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఇంక్విలాబ్ మంచ్ నేత హాదీ వచ్చే ఫిబ్రవరిలో జరిగే ఎన్ని కల్లో పోటీ చేయనున్నారు.
సెంట్రల్ ఢాకాలోని బిజొయ్‌నగర్ ప్రాంతంలో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. దగ్గర్నుంచి కాల్చడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజలకు భద్రతపై భరో సా కల్పించేందుకు, అక్రమ ఆయుధాల బెడద ను తొలగించేందుకు రెండో దశ ఆపరేషన్ డేవిల్ హంట్‌ను త్వరలో మొదలు పెడతామని హోం శాఖను పర్యవేక్షిస్తున్న రిటైర్డు లెఫ్టినెంట్ జనరల్ జహంగీర్ ఆలం చౌదరి మీడియాకు తెలిపారు.
మాజీ మంత్రి నివాసంపై ఫిబ్రవరిలో దాడి జరి గిన నేపథ్యంలో ప్రభుత్వం ఆపరేషన్ డేవిల్ హంట్ మొదటి దశను చేపట్టింది. పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా మద్దతుదారులే ఈ ఆపరేష న్ లక్ష్యమని ఆరోపణలున్నాయి. హాదీపై కాల్పు లు జరిపిన దుండగుల్లో ఒకడైన ఫైజల్ కరీం మసూద్ గురించిన సమాచారం ఇచ్చిన వారికి రూ.37 లక్షల వరకు బహుమానం అందజేస్తామ ని చౌదరి ప్రకటించారు. హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోవడంలో ప్రధాన పాత్ర పోషించిన విద్యార్థి ఉద్యమంలో హాదీ కీలకంగా ఉన్నారు. అప్పటి ఉద్యమ నేతలకు ప్రత్యేక భద్రత కల్పిస్తామని చౌదరి తెలిపారు. హాదీపై జరిగిన హత్యాయత్నాన్ని ఇంక్విలాబ్ మంచ్ తీవ్రంగా ఖండించింది. నిషేధిత అవామీ లీగ్ నేతలందరినీ ఉగ్రవాదులుగా పేర్కొన్న ఇంక్విలాబ్ మంచ్.. వారందరినీ అరెస్ట్ చేయాలంటూ శనివారం దేశవ్యాప్తంగా ఆందోళనలతో ఉ ద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆ పార్టీని భూస్థాపి తం చేయాలని మంచ్ డిమాండ్ చేస్తోంది.


