బ్రస్సెల్స్: ప్రస్తుతం ట్రంప్, జెలెన్స్కీ మధ్య సంబంధాలు ఏమాత్రం మెరుగ్గా లేవు. ఇటీవల రష్యాతో అమెరికా డీజిల్ కొనుగోలు ఒప్పందం చేసుకోవడంతో అగ్రరాజ్యంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు గుర్రుగా ఉన్నారు. ఈ పరిణామాల నడుమ బ్రస్సెల్స్లో జెలెన్స్కీని ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
బ్రస్సెల్స్లో యూరోపియన్ యూనియన్ నేతలతో సమావేశమైన అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఓ జర్నలిస్టు ప్రశ్నిస్తూ" అమెరికాలో నెలకొన్న రాజకీయ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ట్రంప్ తనను లక్ష్యంగా చేసుకుంటున్నారా? అని అడిగారు. దీనికి జెలెన్స్కీ చిరునవ్వు నవ్వుతూ మౌనంగా ఉండిపోయారు. అనంతరం “ఇదే నా సమాధానం” అని చెప్పారు." దీంతో అక్కడున్న విలేకరులు నవ్వుకున్నారు.
కాగా .. ప్రస్తుతం ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయని జెలెన్స్కీ పేర్కొన్నారు. ఒక్క రోజులోనే ఉక్రెయిన్పై వెయ్యి డ్రోన్లతో దాడులు జరిగాయని పేర్కొంటూ, ఇలాంటి పరిస్థితుల్లో జెలెన్స్కీతో మాట్లాడటం కష్టమని అమెరికా వైపు నుంచి వ్యాఖ్యలు రావడంపై ఆయన పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ట్రంప్ తనను రాజకీయంగా బలిపశువును చేస్తున్నారా? అన్న ప్రశ్నకు మాత్రం నేరుగా సమాధానం ఇవ్వకుండా చిరునవ్వుతో స్పందించడం సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఎందుకు ఈ వివాదం?
వచ్చే నెలలో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్ రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, మరోవైపు ఇరాన్ అంశం, డీజిల్ ధరల పెరుగుదల వంటి సమస్యలు ఆయనకు సవాలుగా మారాయి. ఈ పరిస్థితుల్లో తనపై విమర్శలు చేయడం ద్వారా ట్రంప్ రాజకీయంగా ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి దృష్టి మళ్లిస్తున్నారు. అని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
జెలెన్స్కీపై ట్రంప్ వివాదస్పద వ్యాఖ్యలు
రష్యాతో యుద్ధం ముగించేందుకు జెలెన్స్కీ ఇష్టం చూపించడం లేదని బహుశా ఉక్రెయిన్కు కొత్త అధ్యక్షుడు రావాలేమోనన్నారు. అంతేకాకుండా రష్యా అధ్యక్షుడు పుతిన్తో వ్యవహరించడం కంటే జెలెన్స్కీతో చర్చలు జరపడమే చాలా కష్టమని వ్యాఖ్యానించారు. ఈ వివాదాల నేపథ్యంలో ఇప్పుడు జర్నలిస్టు వేసిన ప్రశ్న అందరినీ ఆలోచింపజేసింది.
ఇదీ చదవండి: సైనికచర్యలు శాంతిని ఇవ్వలేవు


